పీఎన్బీ డిఫాల్టర్లు 913..బకాయిలు 11,486 కోట్లు
మాల్యా ఎగవేత రూ.597 కోట్లు
న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్.. తాజాగా మరో ఎనిమిది మంది ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల పేర్లను ప్రకటించింది. ఫిబ్రవరిలో వెల్లడించిన పేర్లతో కలుపుకొని ఈ ఉద్దేశపూర్వకు రుణ ఎగవేతదారుల సంఖ్య 913కు చేరింది. వీరంతా కలసి రూ.11,486 కోట్ల రుణాలను ఎగవేశారని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) పేర్కొంది. కింగ్ షిషర్ విజయ్ మాల్యా బకాయిలు రూ.597.44 కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. ఈ జాబితాలో రూ.900 కోట్ల రుణాలతో విన్‌సమ్ డైమండ్స్ అండ్ జ్యూయలరీ మొదటి స్థానంలో ఉంది.
ఈ జాబితాలో ఫరెవర్ ప్రీసియస్ జ్యూయలరీ అండ్ డైమండ్స్(రూ.748 కోట్ల బకాయిలు), జూమ్ డెవలపర్స్(రూ.410 కోట్లు), నాఫెడ్(224 కోట్లు), యాపిల్ ఇండస్ట్రీస్ (రూ.248కోట్లు), ఎంబీఏ జ్యూయలర్స్(రూ.266 కోట్లు), రామ్‌సరరూప్ గ్రూప్ కంపెనీలు(రూ.411 కోట్లు), ఎస్. కుమార్ నేషన్‌వైడ్(రూ.147 కోట్లు), రాణా గ్రూప్ కంపెనీస్(రూ.169 కోట్లు)లు ఉన్నాయి. కాగా గత ఆర్థిక సంవత్సరం లో మొండి బకాయిల కోసం పీఎన్‌బీ రూ.18,367మ కోట్ల కేటాయింపులు జరిపింది. ఫలితంగా ఈ బ్యాంక్‌కు రూ.3,974 కోట్ల నష్టాలు వచ్చాయి.