
2,929 పరిశ్రమలొచ్చాయి: కేటీఆర్
రాష్ట్రానికి ఇప్పటివరకు 2,929 పరిశ్రమలు వచ్చాయని అసెంబ్లీలో కేటీఆర్ వెల్లడించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు 2,929 పరిశ్రమలు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలో టీఎస్ ఐపాస్‌పై ప్రకటన చేసిన కేటీఆర్.. మెగా ప్రాజెక్టులకు 15 రోజుల్లో, ఇతర పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతి లభిస్తుందని తెలిపారు.
రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలతో 95 వేల మందికి ప్రత్యక్షంగా.. మరో 3 లక్షల మందికి పరోక్షంగా లబ్ది చేకూరుతుందని కేటీఆర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం రావడం గర్వంగా ఉందని అన్నారు.