‘తెలంగాణ ప్రభుత్వం’ పేరుతో ముద్రించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను మాత్రమే వీఆర్‌ఓలు రాయాలని వీఆర్‌ఓల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కుల్కచర్ల: ‘తెలంగాణ ప్రభుత్వం’ పేరుతో ముద్రించిన నూతన పట్టాదారు పాసు పుస్తకాలను మాత్రమే వీఆర్‌ఓలు రాయాలని వీఆర్‌ఓల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాల్‌రాజ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్‌డీఓ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పేరుపై ఉన్న పుస్తకాలను రాయకూడదని, జిల్లాలోని రెవెన్యూ కార్యదర్శులు పాత పాస్తుకాలను వాడకూడదని సూచించారు. కొత్తగా భూములు రిజిస్ట్రేషన్లు చేసుకున్న వారికి, విరాసత్‌కు వచ్చిన వారికి పట్టాదారు పాసు పుస్తకాలు కావాల్సిన వారందరికీ కొత్త పుస్తకాలు ఆర్‌డీఓ కార్యాలయంలో ఉన్నాయని, అవసరం ఉన్నవారు తెచ్చుకుని రైతులకు ఇవ్వాలని ఆయన తెలిపారు.