ఆ వ్యాఖ్యలపై అఖిలేశ్ వివరణ కోరిన బీజేపీ | BJP seeks explanation from Akhilesh over Azam Khan's comment | Sakshi
Sakshi News home page

ఆ వ్యాఖ్యలపై అఖిలేశ్ వివరణ కోరిన బీజేపీ

Published Sat, Oct 24 2015 12:43 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

BJP seeks explanation from Akhilesh over Azam Khan's comment

లక్నో: బాలికలపై జరుగుతున్న అత్యాచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉత్తర ప్రదేశ్ మంత్రి ఆజంఖాన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ వివరణ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. శనివారం బీజేపీ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ విజయ్ బహదూర్ పాఠక్ మీడియాతో మాట్లాడుతూ.. బాలికల అత్యాచారాలకు మొబైల్ ఫోన్లు కారణమన్న ఆజంఖాన్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి వివరణ ఇవ్వాలని అన్నారు.

అఖిలేశ్ యాదవ్ రాష్ట్రంలో విద్యార్థులకు ల్యాప్ట్యాప్లు,  పలు ప్రాంతాల్లో ఉచిత వైఫై సేవలు అందిస్తుండగా.. తన మంత్రివర్గంలోని పట్టణాభివృద్ధి మంత్రిగా పనిచేస్తున్న ఆజంఖాన్ ఈ విధమైన వ్యాఖ్యలు చేయడంపై మాట్లాడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతల పరిరక్షణలో తగిన చర్యలు తీసుకోవాలని పాఠక్ డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement