
అమరీందర్ ఆస్తులు 48.29 కోట్లు
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్‌సింగ్ తనకు రూ. 48.29 కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. వీటిలో దుబాయ్‌లో ఒక ఫ్లాట్, వారసత్వంగా లభించిన పాటియాలలోని మోతీబాగ్ ప్యాలెస్, బంగారు ఆభరణాలు, వజ్రాలు తదితరాలున్నాయి. అయితే 2014 లోక్‌సభ ఎన్నికలప్పుడు ప్రకటించిన ఆస్తులతో పోల్చితే ఇప్పుడవి 40% తగ్గాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్ పాటియాలా(పట్టణ) స్థానంలో ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్‌పై, లాంబిలో సీఎం ప్రకాశ్‌సింగ్ బాదల్‌పై రెండు చోట్లా పోటీచేస్తున్నారు. తన భార్యపేరిట ఉన్న రూ.6.09 కోట్ల ఆస్తులతో పాటు తనకు స్థిర, చరాస్తులన్నీ కలిపి రూ. 42.20 కోట్ల ఆస్తులున్నట్లు నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు.