
పండగ వేళ.. ప్రత్యేక రైళ్లు
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర) :
పండగ వేళ ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు ఈస్ట్‌కోస్ట్ రైల్వే డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి.సునీల్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. సంబల్‌పూర్–బాన్స్‌వాడి(యశ్వంత్‌పూర్)ల మధ్య విశాఖపట్నం మీదుగా, విశాఖపట్నం– హైదరాబాద్, బెంగళూరు–హౌరా తదితర రైళ్లు నడుపుతున్నట్టు పేర్కొన్నారు.
సంబల్‌పూర్– బాన్స్‌వాడి(యశ్వంత్‌పూర్)
ప్రత్యేక రైలు నం.08301 సంబల్‌పూర్–బాన్స్‌వాడి వీక్లీ స్పెషల్ ప్రతి బుధవారం 09.30 గంటలకు సంబల్‌పూర్‌లో బయలుదేరి 19.00 గంటలకు విశాఖపట్నంకు చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 7.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 16.40 గంటలకు బాన్స్‌వాడి (యశ్వంత్‌పూర్) చేరుకుంటుంది. అక్టోబర్ 4 నుంచి డిసెంబర్ 27వ తేదీ వరకు ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది.
తిరుగు ప్రయాణంలో రైలు నం.08302తో బాన్స్‌వాడిలో ప్రతీ శుక్రవారం 00.30 గంటలకు బయలుదేరి అదే రోజు 20.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ 20.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 06.35 గంటలకు సంబల్‌పూర్ చేరుకుంటుంది. ఈ రైలు అక్టోబరు 10వ తేదీ నుంచి డిసెంబర్ 29 వరకు నడుస్తుంది. బర్గారోడ్, బోలంగిర్, టిట్లాఘడ్, కేసింగ, రాయగఢ, విజయనగరం, విశాఖపట్నం, దువ్వాడ, విజయవాడ, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జాలర్‌పేట, కృష్ణరాజపురం స్టేషన్లలో ఆగుతుంది.
∙హైదరాబాద్– విశాఖపట్నం
ప్రత్యేక రైలు నం.07148 హైదరాబాద్–విశాఖపట్నం స్పెషల్ సెప్టెంబర్ 28, 30 తేదీల్లో హైదరాబాద్(నాంపల్లి)లో 18.50 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 08.00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో సెప్టెంబర్ 29, అక్టోబర్ 1వ తేదీల్లో విశాఖపట్నంలో 19.20 గంటలకు బయలుదేరి మరుసటిరోజు 08.50 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతుంది.
బెంగళూరు కంటోన్మెంట్–హౌరా
రైలు నం.06531 బెంగళూరు కంటోన్మెంట్–హౌరా సూపర్‌ఫాస్ట్ రైలు సెప్టెంబరు 21వ తేదీన బెంగళూరు కంటోన్మెంట్‌లో 23.40గంటలకు బయలుదేరుతుంది. శనివారం 10.55 గంటలకు హౌరా చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో రైలు నం.06532 హౌరా– బెంగళూరు కంటోన్మెంట్ సూపర్‌ఫాస్ట్ రైలు హౌరాలో సెప్టెంబరు 24వ తేదీన ఆదివారం తెల్లవారుజామున 01.05 గంటలకు బయలుదేరుతుంది. మంగళవారం 11.40 గం టలకు బెంగళూరు చేరుకుంటుంది. కృష్ణరాజపురం, బంగార్‌పేట, జాలర్‌పేట, కాట్పడి, అరక్కోణం, చెన్నై సెంట్రల్, ఒంగోలు, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళంరోడ్, పలాస, బ్రహ్మపూర్, బలుగాం, ఖుర్దారోడ్, భువనేశ్వర్, కటక్, జాజ్‌పూర్‌కియోంఝర్ రోడ్, భద్రక్, బాలాసోర్, ఖరగ్‌పూర్, సాంత్రాగచ్చి స్టేషన్లలో ఆగుతుంది.
చెన్నై–హౌరాల మధ్య సువిధ స్పెషల్
సెప్టెంబర్ 24వ తేదీ నుంచి నవంబర్ 27వ తేదీ వరకు 02841 సాంత్రగచ్చి– చెన్నై సెంట్రల్ సూపర్‌ఫాస్ట్ రైలు ప్రతీ ఆదివారం సాంత్రగచ్చిలో 12.40గంటలకు బయలుదేరి మరుసటిరోజు 02.05 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 02.35 గంటలకు బయలుదేరి సోమవారం 15.20గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 02842 నంబర్‌తో చెన్నై సెంట్రల్‌లో ప్రతీ సోమవారం 18.20గంటలకు బయలుదేరి మంగళవారం 08.15గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 08.45గంటలకు బయలుదేరి మరుసటిరోజు 23.30గంటలకు సాంత్రగచ్చి చేరుకుంటుంది. ఖరగ్‌పూర్, భద్రక్, కటక్, భువనేశ్వర్, ఖుర్దారోడ్, విశాఖపట్నం, దువ్వాడ, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు స్టేషన్లలో ఆగుతుంది.