2024 లోక్‌సభ ఎన్నికల్లో నేడు చివరిదశ పోలింగ్ జరుగుతోంది. నేడు ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు ఓటింగ్ జరగనుంది. అయితే 2019తో పోల్చి చూస్తే, ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గిందనే మాట సర్వత్రా వినిపిస్తోంది.
దీనికి ఒక మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తన అభిప్రాయం వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల ఓటర్లు ఉదాసీనంగా ఉన్నారని, అందుకే ఆ పార్టీలకు దక్కిన ఓట్లు తక్కువేనన్నారు. ఈ కారణంగానే ఓటింగ్ శాతం తగ్గిందని పేర్కొన్నారు. బీజేపీ మద్దతుదారులైన ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేశారన్నారు.
దేశంలో అధికార ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత లేదని, గత ఎన్నికల డేటాను పరిశీలిస్తే అంటే 2019 మొదటి, రెండవ దశ, 2024 మొదటి, రెండవ దశలలో ఓటింగ్‌శాతం బాగానే ఉన్నదన్నారు. దీనిప్రకారం చూస్తే ఉదాసీనత అనేది బీజేపీ మద్దతుదారులలో లేదని, ప్రదిపక్షాల మద్దతుదారులే ఓటు వేయడానికి ముందుకు రావడం లేదన్నారు.
సమాజ్‌వాదీ పార్టీ మద్దతుదారుల్లో ఉదాసీనత ఉందని బీజేపీ నేత జేపీ నడ్డా ఆరోపించారు. ఇప్పుడు జరుతున్న ఎన్నికలపైనా, మూడోసారి రాబోయే మోదీ ప్రభుత్వంపైనా బీజేపీ మద్దతుదారుల్లో ఉత్సాహం ఉన్నదన్నారు. బీజేపీకి పోటీ లేని స్థానాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment