2024 లోక్‌సభ ఎన్నికల ప్రయాణం నేటితో ముగింపు దశకు చేరుకోనుంది. నేడు (శనివారం,జూన్ 1) జరిగే ఏడో దశ పోలింగ్‌లో ఏడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలలో ఓటింగ్ జరగనుంది. చివరి దశలో ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటు స్థానం వారణాసిలో కూడా ఓటింగ్ జరగనుంది. కేంద్ర మంత్రి ఆర్కే సింగ్, అనురాగ్ ఠాకూర్, నటి కంగనా రనౌత్, భోజ్‌పురి నటుడు రవి కిషన్, భోజ్‌పురి సింగర్ పవన్ సింగ్, కాజల్ నిషాద్ తదితరులు నేడు జరిగే పోలింగ్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
2019లో ఈ 57 సీట్లలో బీజేపీ అత్యధికంగా 25 సీట్లు గెలుచుకుంది. టీఎంసీకి 9, బీజేడీకి 4, జేడీయూ, అప్నాదళ్ (ఎస్)కు చెరో రెండు సీట్లు చొప్పున వచ్చాయి. జేఎంఎం కేవలం ఒక సీటు మాత్రమే గెలుచుకోగలిగింది. పంజాబ్‌లో కాంగ్రెస్ ఎనిమిది సీట్లు గెలుచుకుంది.
2024 లోక్‌సభ ఎన్నికల ఏడవ దశలో బహుజన్ సమాజ్ పార్టీ అత్యధికంగా 56 మంది అభ్యర్థులను బరిలో నిలిపింది. బీజేపీ 51 మంది అభ్యర్థులను నిలబెట్టింది. కాంగ్రెస్ 31 మంది అభ్యర్థులను రంగంలోకి దించింది. టీఎంసీ తొమ్మది మంది అభ్యర్థులకు టిక్కెట్ ఇచ్చింది. సమాజ్‌వాదీ పార్టీ తొమ్మిది మంది అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఎం ఎనిమిది స్థానాల్లో పోటీ చేస్తోంది. అకాలీదళ్ 13 మంది అభ్యర్థులను ఎన్నికల రంగంలోకి దింపింది. పంజాబ్‌లోని మొత్తం 13 స్థానాల్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేస్తోంది. బిజూ జనతాదళ్ ఆరుగురు అభ్యర్థులను నిలబెట్టింది. సీపీఐ ఏడుగురు అభ్యర్థులను రంగంలోకి దించింది.
2019 ఎన్నికల్లో మొదటి దశలో 70 శాతం ఓటింగ్ జరిగింది. 2024 మొదటి దశలో ఓటింగ్ శాతం 66.1గా ఉంది. 2019 రెండవ దశలో 70.1శాతం ఓటింగ్ నమోదైంది. 2024 రెండవ దశలో 66.7 శాతం ఓటింగ్ నమోదైంది. 2019 మూడవ దశలో ఓటింగ్ శాతం 66.9శాతం. 2024 మూడో దశలో 65.7 శాతం ఓటింగ్ జరిగింది. 2019 నాలుగో దశలో 69.1 శాతం ఓటింగ్ జరగగా, 2024 నాలుగో దశలో 69.2 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఐదో దశలో 62 శాతం ఓట్లు పోలయ్యాయి. 2024 ఐదవ దశలో 62.2 శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఆరవ దశలో 64.2 శాతం ఓటింగ్ జరిగింది. 2024 ఆరవ దశ ఎన్నికలలో 63.4 శాతం ఓటింగ్ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment