దేశంలో లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ నేడు(శనివారం) జరుగుతోంది. దీనిలో భాగంగా బీహార్‌లోని జెహనాబాద్ లోక్‌సభ నియోజకవర్గానికి కూడా పోలింగ్ కొనసాగుతోంది. అయితే ఈ నియోజక వర్గంలో ఒక విచ్రిత ఉదంతం వెలుగు చూసింది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా ఓటర్లకు ఆదర్శంగా నిలుస్తోంది.
జెహనాబాద్‌లోని బూత్ నంబర్ 151 పరిధిలోని దేవ్ కులీ గ్రామానికి చెందిన మిథిలేష్ యాదవ్, మనోజ్ యాదవ్‌ల తల్లి వృద్ధాప్య సమస్యలతో మృతి చెందింది. అయితే కుటుంబ సభ్యులు ఓటు వేసి, వచ్చాకనే ఆ మహిళకు దహన సంస్కారాలు చేయాలని నిర్ణయించుకున్నారు.
ఈ సందర్భంగా మృతురాలి కుమారుడు మనోజ్‌యాదవ్ మాట్లాడుతూ ఐదేళ్లకోసారి ఓటింగ్ వస్తుందని, ఇవి ఎంతో ముఖ్యమైనవని, అందుకే తామంతా ముందుగా ఓటువేయాలనుకున్నామని తెలిపారు. ఓటింగ్ పూర్తయ్యాకనే తల్లికి దహన సంస్కారాలు చేస్తామన్నారు.
మృతురాలి కుటుంబానికి చెందిన ఉషాదేవి మాట్లాడుతూ ఓటింగ్ అనేది తప్పనిసరి అని, అందుకే ముందుగా ఓటు వేయబోతున్నామని తెలిపారు. వారంతా క్యూలో నిలుచుని, తమ వంతు వచ్చాక ఓటువేశారు. ఆ తర్వాత తల్లి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment