ప్రపంచంలోనే ఎత్తయిన పోలింగ్‌ స్టేషన్‌లో ఓట్ల పండుగ | Voting on at Himachal Pradesh Worlds Highest Polling Station | Sakshi
Sakshi News home page

ప్రపంచంలోనే ఎత్తయిన పోలింగ్‌ స్టేషన్‌లో ఓట్ల పండుగ

Published Sat, Jun 1 2024 2:18 PM | Last Updated on Sat, Jun 1 2024 3:37 PM

Voting on at Himachal Pradesh Worlds Highest Polling Station

ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన పోలింగ్‌ స్టేషన్‌ హిమాలయాల శిఖరాలపై 15,256 అడుగుల ఎత్తులోని తాషిగ్యాంగ్‌ అనే చిన్న గ్రామంలో ఉంది. ఈ ప్రాంతంలో మొబైల్ కనెక్టివిటీ కూడా లేదు. అయినా ఇక్కడ ఎన్నికలను నిర్వహించడానికి అధికారులు అన్ని  ఏర్పాట్లు చేశారు.

భారత్‌-చైనా సరిహద్దుకు సమీపంలోని స్పితి వ్యాలీ.. హిమాచల్‌లోని నాలుగు పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఇది మండీ లోక్‌సభ స్థానం పరిధిలోకి వస్తుంది. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై బీజేపీ నుంచి నటి కంగనా రనౌత్ పోటీకి దిగారు.

తాషిగ్యాంగ్‌లో ఏర్పాటు చేసిన ఈ పోలింగ్ బూత్‌లో 62 మంది ఓటు వేయనున్నారు. తాషిగ్యాంగ్‌లో పోలింగ్‌ నిర్వహించడం ఇది నాలుగోసారి. అదనపు జిల్లా కమిషనర్ జైన్ మాట్లాడుతూ 2022లో విపరీతమైన చలి ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి చెందిన అర్హులైన ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement