ఇంద్రకరణ్‌రెడ్డికి వారెంట్ | Minister indrakaran Reddy warrent! | Sakshi
Sakshi News home page

ఇంద్రకరణ్‌రెడ్డికి వారెంట్

Published Tue, Jun 21 2016 3:11 AM | Last Updated on Mon, Sep 4 2017 2:57 AM

ఇంద్రకరణ్‌రెడ్డికి వారెంట్

ఇంద్రకరణ్‌రెడ్డికి వారెంట్

సాక్షి, హైదరాబాద్: వాలీబాల్ అసోసియేషన్ ఎన్నికల వివాదం కేసులో ఫిర్యాదుదారుగా ఉండీ  వాంగ్మూలం ఇచ్చేందుకు కోర్టుకు హాజరుకాని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి నాంపల్లి సీసీఎస్ కోర్టు సోమవారం వారెంట్ జారీ చేసింది. జూలై 11న  ఆయన కోర్టుకు హాజరుకావాలని స్పష్టం చేస్తూ న్యాయమూర్తి డ్యానీరూథ్ విచారణను వాయిదా వేశారు. గతంలో వాలీబాల్ అసోసియేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షునిగా ఇంద్రకరణ్‌రెడ్డి ఎన్నికయ్యారు. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన హరినాథ్‌రెడ్డి తాను ఎన్నికైనట్లు ప్రకటించుకున్నారు.

హరినాథ్‌పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంద్రకిరణ్‌రెడ్డి సీసీఎస్‌కు ఫిర్యాదు చేశారు. విచారణకు చేపట్టిన కోర్టు.. ఇంద్రకరణ్‌రెడ్డికి వాంగ్మూలం ఇవ్వాలంటూ సమన్లు జారీచేసింది. వాటిని సీసీఎస్ అధికారులు ఇంద్రకరణ్‌రెడ్డికి అందించారు. అయినా ఇంద్రకరణ్‌రెడ్డి కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement