kadapa rims hospital
-
‘ప్రభుత్వాస్పత్రుల రూపు రేఖలు మారుస్తాం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : నాడు నేడు కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. ప్రభుత్వ ఆస్పత్రిల్లో ఉన్న సిబ్బంది కొరతను త్వరలోనే అదిగమిస్తామని చెప్పారు. వైఎస్సార్ కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన.. సోమవారం కడప రిమ్స్ ఆస్పత్రిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు 352.62 కోట్ల రూపాయలతో 7 రకాల అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన కొరకు ఏర్పాటు చేసిన శిలాఫలకాల ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. (చదవండి : రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్) మానసిక వికలాంగుల ఆస్పత్రి కోసం రూ.40.82 కోట్లు, వైఎస్సార్ క్యాన్సర్ ఆస్పత్రి కొరకు రూ.107కోట్లు, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి రూ.125 కోట్లు, పోలీసుల భవన నిర్మాణానికి రూ.20.95 కోట్లు కేటాయించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రిమ్స్ ఆస్పత్రితో పాటు రాష్ట్రంలోని వైద్యశాలలన్నింటిలో మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆస్పత్రులలో సిబ్బంది కొరత ఉందని, త్వరలోనే దానిని అధిగమిస్తామని సీఎం తెలిపారు. -
కడప రిమ్స్ ఆసుపత్రిలో ఎంపీ అవినాశ్‌రెడ్డి తనిఖీలు
-
వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసులురెడ్డి మృతిపై ఆందోళన
-
కడప రిమ్స్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా కడప పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రి వద్ద బుధవారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. వైఎస్సార్సీపీ నేత శ్రీనివాసులురెడ్డి మంగళవారం సరైన వైద్యం అందక మృతిచెందారు. దీంతో ఆగ్రహించిన ఆయన కుటుంబసభ్యులు, బంధువులు శ్రీనివాసులురెడ్డి మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలియడంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అక్కడికి చేరుకొని.. రిమ్స్ డైరెక్టర్ శశిధర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో కనీస వైద్య పరికరాలు పనిచేయకపోవడం దారుణమని ఆయన మండిపడ్డారు. డాక్టర్లు వైద్యం చేయకపోవడం వల్లే శ్రీనివాసులురెడ్డి మృతి చెందారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కచ్చితంగా వైద్యుల నిర్లక్ష్యమేనని అవినాష్‌రెడ్డి అన్నారు. ఎన్నో ఉన్నత ఆశయాలతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రిమ్స్ ఆస్పత్రిని నిర్మిస్తే.. ప్రస్తుతం ఆ ఆస్పత్రిని నాశనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
ట్రాక్టర్-బైక్ ఢీ.. విద్యార్థికి తీవ్ర గాయాలు
వేంపల్లి: వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం పాములూరు-అలవలపాడు రహదారి మార్గంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. వీరపునాయుని పల్లి మండలం ఓబులరెడ్డి పల్లి గ్రామానికి చెందిన గంగా మహేంద్ర అనే డిగ్రీ విద్యార్థి బుధవారం ఉదయం పులివెందుల లయోలా డిగ్రీ కళాశాలలో పరీక్ష రాసేందుకు మోటార్ బైక్ పై బయలుదేరాడు. పాములూరు-వేంపల్లి రహదారి మధ్యలో గ్రావెల్ తరలిస్తున్న ఓ ట్రాక్టర్ మహేంద్ర వెళ్తున్న బైక్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విద్యార్థికి ఎడమ చేయి, ఎడమ కాలు విరిగినట్లు సమాచారం. చికిత్స నిమిత్తం 108 లో వేంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు.