శుద్ధ జలం తాగుతున్న ప్రయాణికురాలు
మదనపల్లె సిటీ: ఆటోజానీ, ఆటో రాజా.. ఇలా రకరకాల పేర్లతో కొందరు హీరోలు సినిమాల్లో ఆటో డ్రైవర్ల పాత్రలో అభిమానులను మెప్పించారు. అయితే నిజ జీవితంలో ఆటో డ్రైవర్ పఠాన్ బాబు సామాన్యులకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి ప్రయాణ అవసరాలను తీరుస్తూ అందరివాడిగా నిలుస్తున్నాడు.
►మదనపల్లె పట్టణం సైదాపేటకు చెందిన పఠాన్‌బాబు దాదాపు 35 ఏళ్లుగా ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. రోజూ ప్యాసింజర్లను ఆటోల్లో తీసుకెళ్తున్నపుడు గర్భిణులు, బాలింతలు, ఇతర ప్రయాణికులు పడే బాధలు చూసి చలించిపోయాడు. అప్పటి నుంచి తాను సంపాదించిన దాంట్లో కొంత మేరకై నా పేదల కోసం వెచ్చించాలనే తపనతో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా దివ్యాంగులు, గర్భిణులను ఉచితంగా ఆటోలో తీసుకెళ్తున్నారు. ప్రయాణికుల దాహార్తి తీర్చేందుకు ఐదేళ్లుగా తన ఆటోలో శుద్ధజల క్యాన్ ఏర్పాటు చేస్తున్నాడు. ప్రయాణికులే కాకుండా బెంగుళూరు బస్టాండులో ఆటో కార్మికులు ఈ మినరల్ వాటర్ తాగుతున్నారు. ఈయన సేవలను గుర్తించిన పలువురు అభినందిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై అభిమానంతో ఆటోలో పార్టీ జెండా గుర్తులు, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి ఫొటోలు పెట్టుకున్నాడు.
సేవలోనే సంతృప్తి
వైఎస్సార్ పార్టీ అంటే ఎనలేని అభిమానం. సమాజ సేవ చేయడంలోనే సంతృప్తి కలుగుతోంది. రోజూ సంపాదనలో కొంత మేరకు ఖర్చు చేస్తా. ఆటో డ్రైవర్లు అంటే మంచి భావన కలిగే విధంగా చేయాలన్నదే ధ్యేయం. ఎంతో మంది గర్భిణులను ఉచితంగా ఆస్పత్రులకు తీసుకెళుతున్నా. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగిస్తా.
– పఠాన్‌బాబు, ఆటో డ్రైవర్, మదనపల్లె
Comments
Please login to add a commentAdd a comment