
‘నంద్యాల మొత్తం శిల్పా మోహన్‌రెడ్డికే జై’
రోడ్ల విస్తరణ అంటూ సామాన్యులు, వ్యాపారులను రోడ్డున పడేశారని, ప్రత్యామ్నాయాలు చూపడకుండా అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అభివృద్ధి గురించి పట్టించుకోని టీడీపీ నాయకులు ఇప్పుడు మాత్రం హడావుడి చేస్తున్నారని, ఇన్నాళ్లు ఎక్కడికి వెళ్లారని నిలదీశారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప టీడీపీ కొత్తగా చేసిందేమీ లేదని స్పష్టం చేశారు.