19 కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించామని ప్రభుత్వ విప్ శ్రీనివాసులు అన్నారు. గతంలో ప్రతిపక్షం గొంతు నొక్కారు.. కానీ తాము ప్రతిపక్షానికి సమాన అవకాశం ఇచ్చామని తెలిపారు. సమావేశాలు పూర్తయ్యేంతవరకూ ప్రతిరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని బిల్లులపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారని తెలిపారు.