ప్రతిపక్ష పార్టీకి సమాన హక్కులు, అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చారిత్రాత్మక బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. అన్ని వర్గాలకు మంచి జరగాలని కీలక బిల్లులు ఆమోదించామన్నారు. రాబోయే రోజుల్లో అవినీతి రహిత పాలన ఉంటుందని తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ వైఖరి సమంజసంగా లేదన్నారు. టీడీపీకి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు.