Avanti Srinuvasarao
-
బాడ సూరన్నకు వంగపండు అవార్డు అందజేసిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, విశాఖటప్నం: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధ్వర్యంలో జానపద వాగ్గేయకారుడు వంగపండు వర్ధంతి సభ బుధవారం ఘనంగా జరిగింది. జానపద వాగ్గేయకారుడు వంగపండు స్మారక అవార్డుతో..బాడ సూరన్నను సత్కరించారు మంత్రి అవంతి శ్రీనివాసరావు. అవార్డులో భాగంగా ప్రభుత్వం తరఫున మంత్రి బాడ సురన్నకు రూ.2 లక్షలు అందజేశారు. అనంతరం అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ.. కళలు, కళాకారులను గుర్తించిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మాత్రమే అన్నారు. ‘‘నా గురువు వంగపండు పాట ద్వారా అవార్డు దక్కడం గర్వంగా ఉంది’’ అన్నారు సూరన్న. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్ నారాయణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వంగపండు వర్ధంతి సభను ప్రభుత్వం నిర్వహించడం గొప్ప విషయం. వంగపండు విగ్రహ ఏర్పాటు ద్వారా కళాకారులకు గుర్తింపు లభించింది. సీఎం వైఎస్ జగన్‌కు కళాకారుల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అన్నారు. -
పేదల గుండె చప్పడు వైఎస్సార్: ఆవంతి శ్రీనివాస్
సాక్షి, విశాఖపట్నం : పేదల గుండెచప్పుడు తెలిసిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి డాక్డర్ వైఎస్ రాజశేఖరరెడ్డి అని పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు. ఆయన ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిఉంటారన్నారు. గురువారం మద్దిలపాలెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ముత్తంశెట్టి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి జీవితం అందరికీ అదర్శమన్నారు. రాజకీయ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన వైనం స్ఫూర్తిదాయకమన్నారు. ఈ సందర్భంగా సేవాదళ్ నగర మహిళా అధ్యక్షరాలు, రజక కార్పొరేషన్ చైర్మన్ ఈగలపాటి యువశ్రీ నిర్వహణలో పలువురు రక్తదానం చేశారు. బీచ్‌రోడ్డులో... బీచ్‌రోడ్డులోని వైఎస్సార్ విగ్రహానికి నగర మేయర్ హరివెంకట కుమారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ముత్తంశెట్టి మాట్లాడారు. వైఎస్సార్ జయంతిని ‘రైతు దినోత్సవం’గా రాష్ట్ర ప్రజలు జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. మేయర్ హరివెంకట కుమారి మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించారని, ఒక మహిళను హోమ్ మినిస్టర్ చేసిన ఘనత ఆయనదేనన్నారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షడు వంశీకృష్ణశ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో రాజశేఖరరెడ్డి చేసిన మేలు, సంక్షేమ పథకాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ లేని ఆంధ్రప్రదేశ్‌ను ఊహించుకోలేమన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు మళ్ల విజయప్రసాద్, కేకే రాజు, అక్కరమాని విజయనిర్మల, మాజీ ఎమ్మెల్యేలు తైనాల విజయకుమార్, ఎస్ఏ రెహమాన్, తిప్పల గురుమూర్తిరెడ్డి, పంచకర్ల రమేష్‌బాబు, చింతలపూడి వెంకటరామయ్య, కార్పొరేషన్ చైర్మన్లు కోలా గురువులు, మధుసూదన్‌రావు, పి.సుజాత నూకరాజు, పి.సుజాత సత్యనారాయణ, పార్టీ అదనపు కార్యదర్శులు రవిరెడ్డి, మొల్లి అప్పారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, పార్టీ ముఖ్యనాయకులు పీవీఎస్ రాజు, అల్లంపల్లి రాజుబాబు, ద్రోణంరాజు శ్రీవాత్సవ, సతీష్‌వర్మ, మంత్రి రాజశేఖర్, కాశీవిశ్వనాథం, పేడాడ రమణికుమారి, కార్పొరేటర్లు రెయ్యి వెంకటరమణ, శశికళ, బర్కత్ అలీ, మొల్లి లక్ష్మి, చిన్న జానికీరామ్, కెల్లా సత్యనారాయణ, అప్పలరత్నం, విల్లూరి భాస్కరరావు, కార్పొరేషన్ డైరెక్టర్లు బి.పద్మావతి, పేర్ల విజయచందర్, షబీర్ బేగం, జిల్లా, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు జి. శ్రీధర్‌రెడ్డి, బి.కాంతారావు, బోని శివరామకృష్ణ, షరీఫ్, బాకి శ్యాంకుమార్‌రెడ్డి, మారుతిప్రసాద్, పైడి రత్నాకర్, మైకల్రాజ్, చొక్కర శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
ముంపు ప్రాంతాలను పరిశీలించిన మంత్రి అవంతి
విశాఖ : భారీ వర్షాల కారణంగా విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రాంబిల్లి మండలం గురజాల గ్రామం వద్ద శారదా నదికి గండి పడటంతో దాదాపు 4500 ఎకరాల వరి పంట నీట మునిగింది. అదే సమయంలో గ్రామం చుట్టూ నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వరదలు తగ్గిన వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకుంటామని మంత్రి అవంతి తెలిపారు. -
ఏం మాట్లాడతారో పవన్‌కే తెలియదు
-
‘ప్రపంచస్థాయిలో విశాఖను తీర్చిదిద్దుతాం’
సాక్షి, విశాఖపట్నం: పరిపాలనా రాజధానిగా విశాఖ నగరానికి అన్ని హంగులు సమకూర్చబోతున్నామని పర్యాటక శాఖా మంత్రి అవంతి శ్రీనివాసరావు తెలిపారు. శుక్రవారం ఆయన భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ ప్రాంతంలో రూ. 4.5 కోట్ల అభివృద్ది పనులకి శంఖుస్థాపనలు చేశారు. (విశాఖ బీచ్ కోతని అరికట్టేందుకు..) ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ, ‘పూర్తి స్ధాయి మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత ఏడాది విశాఖ నగరంలో రూ.1000 కోట్ల పైన అభివృద్ది పనులకి శ్రీకారం చుట్టారు. ఒక్క భీమిలి నియోజకవర్గంలోనే 17 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నాం. ఈ రోజు(శుక్రవారం) రూ. 4.5 కోట్లతో మధురవాడ ప్రాంతంలో అభివృద్ది పనులకి శంఖుస్థాపనలు చేశాం. విశాఖ నగరంలో మౌలిక వసతులపై దృష్టి పెట్టాం. అభివృద్ది చెందడానికి విశాఖ నగరానికి అన్ని అర్హతలు ఉన్నాయి. . రాబోయే రోజులలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. విశాఖ నగరం 2019 కి ముందు...ఆ తర్వాత అన్న తేడాలను ప్రజలు స్పష్టంగా గుర్తిస్తారు. ఎయిర్ పోర్టు, మూడు పోర్టులు, రైల్వే డివిజన్...ఇలా అన్ని వసతులు ఉన్న నగరం విశాఖ పట్నం. అంతర్జాతీయ నగరంగా విశాఖను తీర్చిదిద్దుతాం. (13 జిల్లాల్లో డి ఎడిక్షన్ సెంటర్లు ప్రారంభం) -
టీడీపీకి అవకాశం ఇచ్చినా వినియోగించుకోలేదు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష పార్టీకి సమాన హక్కులు, అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని మంత్రి అవంతి శ్రీనివాస్ ఆరోపించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ.. ఈ అసెంబ్లీ సమావేశాల్లో చారిత్రాత్మక బిల్లులు ఆమోదం పొందాయని తెలిపారు. అన్ని వర్గాలకు మంచి జరగాలని కీలక బిల్లులు ఆమోదించామన్నారు. రాబోయే రోజుల్లో అవినీతి రహిత పాలన ఉంటుందని తెలిపారు. ప్రతిపక్ష టీడీపీ వైఖరి సమంజసంగా లేదన్నారు. టీడీపీకి అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేదని ఆరోపించారు. 19 కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ఆమోదించామని ప్రభుత్వ విప్ శ్రీనివాసులు అన్నారు. గతంలో ప్రతిపక్షం గొంతు నొక్కారు.. కానీ తాము ప్రతిపక్షానికి సమాన అవకాశం ఇచ్చామని తెలిపారు. సమావేశాలు పూర్తయ్యేంతవరకూ ప్రతిరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్ని బిల్లులపై పూర్తి స్థాయిలో కసరత్తు చేశారని తెలిపారు. -
అసెంబ్లీలో ప్రతిపక్షం వైఖరి సమంజసంగా లేదు
-
ప్రజలు నన్ను సొంత మనిషిగానే చూశారు
-
పోలీసుల అలెర్ట్
సాక్షి, విశాఖపట్నం : తెలంగాణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే ప్రయత్నాలను నిరసిస్తూ వైఎస్సార్సీపీతో పాటు ఎన్జీవోలు గురువారం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో జిల్లాపోలీస్ శాఖ అప్రమత్తమైంది. ఎక్కడా అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా అదనపు బలగాలను మోహరిస్తోంది. జిల్లాలోని అన్ని ప్రధాన కూ డళ్లలో బుధవారం రాత్రి నుంచే నిఘా పెం చింది. గురువారం భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు కుమార్తె వివాహం కూడా జరగనున్న నేపథ్యంలో పలువురు వీవీఐపీలు ఈ వేడుకకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా పోలీసుశాఖ జల్లెడ పడుతోంది. బంద్ సందర్భంగా ఎక్కడా ఆందోళనలు తలెత్తకుండా ఉండేందుకు కేంద్రం పంపిన అదనపు బలగాలను జిల్లా అంతటా బుధవారం రాత్రి నుంచే మోహరించింది. జాతీయ రహదారిపై ఆటంకాలు లేకుండా చేసేందుకు ఎక్కడికక్కడ బలగాలను తరలించారు. ఉదయం నుంచే ప్రత్యేక బలగాలతోపాటు సిటీ పోలీసులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దుగ్గల్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసు అధికారులతో బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు. -
అనకాపల్లికి అవంతి?
=ముత్తం శెట్టికి చంద్రబాబు ఆఫర్ =ఇప్పుడే ఏమీ చెప్పలేనన్న శ్రీనివాస్ విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి : భీమిలి శాసనసభ్యుడు అవంతి శ్రీనివాసరావు రాబోయే ఎన్నికల్లో అనకాపల్లికి తరలివెళ్తారా? పనిలో పనిగా టీడీపీ తీర్థం పుచ్చుకుంటారా? ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ సందేహాలు నిజమయ్యేట్టు కనిపిస్తున్నాయి. ఆయన అనకాపల్లి నియోజకవర్గం నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపున ఆయన అనకాపల్లి లోక్‌సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం వల్ల ఈ సారి ఎన్నికల్లో సీమాం ధ్రలో ఆ పార్టీ అభ్యర్థులుగా బరిలోకి దిగితే డిపాజిట్లు దక్కడం కూడా కష్టమనే భయం అనేక మంది ఎంపీలు, ఎమ్మెల్యేలను బెంబేలెత్తిస్తోంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు వేరు దారులు వెదుక్కునే పనిలో పడ్డారు. మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన వర్గీయులుగా ముద్రపడ్డ ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాసరావు, చింతల పూడి వెంకట్రామయ్య, పంచకర్ల రమేష్‌బాబు, కన్నబాబురాజు రాబోయే ఎన్నికల నాటికి కాంగ్రెస్ జెండా ఎత్తేస్తారని చాలా కాలంగా జోరుగా ప్రచారం జరుగుతోంది. సమీకరణలు సరిపోతే వీరంతా ప్రస్తుత స్థానాలు కాకుండా ఇతర స్థానాల నుంచి తెలుగుదేశం అభ్యర్థులుగా బరిలోకి దూకుతారనే వాదనను టీడీపీ వర్గాలు కూడా కొట్టి పారేయలేక పోతున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అవంతి శ్రీనివాసరావు మూడు రోజుల కిందట హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి కలిశారు. ఈ సందర్భంలో చంద్రబాబుకు ఆయనకు మధ్య జరిగిన రాజకీయ సంభాషణల్లో అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా అవంతికి చంద్రబాబు ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. అనకాపల్లి టీడీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించిన దాడి వీరభద్రరావు, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆ నియోజకవర్గంలో పార్టీని నడిపేందుకు సరైన నాయకుడు లేకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో అవంతికి ఉన్న ఆర్థిక బలాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ ఆఫర్ ఇచ్చివుంటారని టీడీపీ వర్గాల్లో గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే చంద్రబాబుతో జరిగిన చర్చలో టీడీపీలో చేరే విషయం గురించి శ్రీనివాసరావు ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదనీ, దీని గురించి ఇప్పుడే తానే మీ చెప్పలేనని దాట వేశారని తెలిసింది. ఈ విషయంపై అవంతి శ్రీనివాసరావు సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ డిసెంబరు 1న జరగనున్న తన కుమారై నిశ్చితార్థానికి ఆహ్వానించడానికే చంద్రబాబును కలిశానని చెప్పా రు. ఇందులో రాజకీయమేమీ లేదనీ, తమ మధ్య మామూలు అంశాలు తప్ప రాజకీయ పరమైన చర్చలేమీ జరగలేదని తెలిపారు.