విశాఖ : భారీ వర్షాల కారణంగా విశాఖ జిల్లాలోని పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. రాంబిల్లి మండలం గురజాల గ్రామం వద్ద శారదా నదికి గండి పడటంతో దాదాపు 4500 ఎకరాల వరి పంట నీట మునిగింది. అదే సమయంలో గ్రామం చుట్టూ నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాసరావు, అనకాపల్లి ఎంపీ డాక్టర్ సత్యవతి పరిశీలించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వరదలు తగ్గిన వెంటనే పంట నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకుంటామని మంత్రి అవంతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment