korumutla srinivas
-
‘బద్వేలు తీర్పు సీఎం జగన్‌పై నమ్మకానికి నిదర్శనం’
తాడేపల్లి: బద్వేలు తీర్పు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై నమ్మకానికి నిదర్శనమని ప్రభుత్వవిప్ కోరుముట్ల శ్రీనివాస్ స్పష్టం చేశారు. వైఎస్ జగన్ అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధికి ప్రజలకు అండగా నిలుస్తున్నాయని, మేనిఫెస్టోను అమలు చేసి సీఎం జగన్ తన క్రెడిబిలిటీ నిరూపించుకున్నారని ప్రశంసించారు. టీడీపీ కుట్రలు చేసి అలజడి సృష్టించాలనుకున్నా ఏమిచేయలేకపోయారని కోరుముట్ల శ్రీనివాస్ విమర్శించారు. బద్వేల్లో ప్రజలు.. రికార్డు స్థాయిలో దాసరి సుధకు 90 వేల మెజారిటీ ఇచ్చారని అన్నారు. ‘ప్రజలు నైతిక పాలనకు ప్రజలు దివేనలు అందించారు’ కర్నూలు: కరోనా విపత్తులోను.. సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలను అందించారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిపక్షాలు కావాలనే వైఎస్ జగన్ పాలనపై పనిగట్టుకుని బురద జల్లుతున్నాయన్నారు. రెండు సంవత్సరాలుగా ప్రతి పక్షనేతలు.. ప్రాంతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.బద్వేలు ఎన్నికల్లో టీడీపీ హైడ్రామాలు ఆడిందని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ విమర్శించారు. నైతికంగా సుపరిపాలన అందిస్తున్న.. వైఎస్ జగన్ పాలనకు ప్రజలు దివెనలు అందించారని ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ తెలిపారు. -
ఢిల్లీలో చంద్రబాబు విష ప్రచారం
-
మాట్లాడింది పట్టాభి.. మాట్లాడించింది బాబు : కోరుముట్ల
-
అసెంబ్లీలో ప్రతిపక్షం వైఖరి సమంజసంగా లేదు
-
చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగిపోయారు: కోరుముట్ల
-
ముక్కంటి సేవలో కోరుముట్ల
శ్రీకాళహస్తి: శ్రీ కాళహస్తి పుణ్యక్షేత్రానికి కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో సోమవారం విచ్చేశారు. అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయం సమీపంలో పార్టీ స్థానిక సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి సారథ్యంలో ఘనంగా సత్కరించి స్వాగతం పలికారు. ప్రత్యేక టిక్కెట్ ద్వారా రాహుకేతు పూజలు చేయించుకున్నారు. అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వాదం పొందారు. వారికి ఆలయాధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. వారితో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. -
రేపు జంతర్‌మంతర్ వద్ద వైఎస్సార్సీపీ ధర్నా
ఢిల్లీ: రాష్ట్రానికి సమన్యాయం చేయాలని కోరుతూ బుధవారం వైఎస్సార్సీపీ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టనుందని ఆ పార్టీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తిప్పారెడ్డి, మేకా శేషుబాబు తెలిపారు. ఈ రోజు రాష్ట్రపతిని, ప్రధానిని కలసిన వైఎస్సార్సీపీ బృందం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని విన్నవించామన్నారు. సమన్యాయం చేయకుంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పేర్కొన్నట్లు తెలిపారు. ఉదయం 10గం.ల నుంచి మధ్యాహ్నం 1గం. వరకూ నిరసన కార్యక్రమం చేపడతామన్నారు. గతంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహిస్తామని చెప్పి వెనుతిరగడాన్ని శ్రీనివాస్ ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి జడిసే వెనక్కు తగ్గారని ఆయన ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ నేతలకు ప్రజలపై మమకారం లేకపోవడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. తెలుగుదేశం పార్టీ దివాళ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి కష్టాల్లో ఉన్నా.. ప్రజల గురించి ఆలోచించి జైల్లోనే దీక్షకు పూనుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు.