రైల్వే కోడూరు (వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌తో శనివారం ఉదయం కడప-తిరుపతి జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రైల్వే కోడూరు మండలం కుప్పలదొడ్డి వద్ద జాతీయ రహదారిపై బైఠాయించి బంద్ నిర్వహించారు. తాటిమొద్దులు రోడ్డుపై వేసి నిప్పంటించారు. దీంతో ఇరువైపులా 12 కిలోమీటర్ల మేర వాహనాలు ఆగిపోయాయి.