
అన్నమయ్య జిల్లా: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థల మీద రాజకీయం చేస్తుంటాడని, ఇప్పుడు ఏదీ లేక వెంకటేశ్వరస్వామితో రాజకీయం చేస్తున్నాడని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. వెంకటేశ్వరస్వామితో రాజకీయం చేసే చంద్రబాబు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని కొరముట్ల శ్రీనివాసులు ధ్వజమెత్తారు.
వంద రోజుల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చాడని, అసలు పరిపాలన ఏం చేశాడని ప్రశ్నించారు. ప్రజలకిచ్చిన ఎటువంటి హామీలు నెరవేర్చని చంద్రబాబు.. ఇప్పుడు ఆర్భాటాలతో హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. సూపర్‌సిక్స్ హామీలు అమలు చేయలేక, యూట్యూబ్‌లో యాడ్స్‌లాగా డైవర్ట్ చెయ్యడానికి తిరుమల లడ్డూ వివాదాన్ని తెరపైకి తెస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వానికి చెందిన ల్యాబ్ మైసూర్‌లో ఉంటే, గుజరాత్‌లోని ల్యాబ్‌లో లడ్డు టెస్ట్ చేయించారన్నారు. అందులో మర్మం ఏమిటని శ్రీనివాసులు నిలదీశారు. శ్రీవెంకటేశ్వరస్వామికి ఒక్కసారి కూడా తలనీలాలు ఇవ్వని చంద్రబాబుకు వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. వైఎస్ జగన్ తన పాదయాత్రకు ముందు తరువాత తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేశారు శ్రీనివాసులు.
Comments
Please login to add a commentAdd a comment