సాక్షి, హైదరాబాద్: ఏపీ రాష్ట్రవ్యాప్తంగా దళితులపై ఎన్నో దాడులు జరిగాయని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై దాడులెన్ని జరిగినా.. ఏ ఒక్క ఘటనపై కనీస చర్యలు గానీ , కేసులు గానీ లేవన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 105 అడుగుల విగ్రహమని చెప్పి నాలుగేళ్లుగా ఆ మాటే విస్మరించారని మండిపడ్డారు.
విగ్రహం ఏర్పాటుకు దీక్ష తలపెట్టిన నాయకులను అన్యాయంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఏపీలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేక ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. అంబేద్కర్ ఉండి ఉంటే.. చంద్రబాబు నాయుడు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్న తీరు చూసి బాధపడేవారని వ్యాఖ్యానించారు. బాబుకు విదేశీ పర్యటనలపై ఉన్న మోజు రాష్ట్ర అభివృద్ధిపై లేదన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించమని అంబేద్కర్‌కు వినతి పత్రాలు అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment