సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి బయల్దేరి సింగపూర్ వెళ్లారు.
హైదరాబాద్: సీఎం చంద్రబాబు ఆదివారం రాత్రి బయల్దేరి సింగపూర్ వెళ్లారు. ఆయన వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రణాళిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి సతీష్ చంద్ర, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎ.గిరిధర్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్‌లు కూడా వెళ్లారు. సింగపూర్ పర్యటనలో భాగంగా కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్న ఉన్నతస్థాయి ప్రతినిధి బృందంతో బాబు సమావేశమవుతారు.
సింగపూర్ విదేశీ వ్యవహారాల మంత్రి కె.షణ్ముగంతో 30వ తేదీన చంద్రబాబు సమావేశమవుతారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ (ఎన్‌యూఎస్)తో వ్యర్థపదార్ధాల నిర్వహణపై రాష్ట్రప్రభుత్వం అవగాహనా ఒప్పందం కుదుర్చుకోనుంది. 31వ తేదీన సీఎం సింగపూర్ సీనియర్ మంత్రి గో చోక్ టంగ్‌తో సమావేశమవుతారు. 31వ తేదీ సాయంత్రం చాంగై విమానాశ్రయం నుంచి బయల్దేరి అదే రోజు రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు.