'టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట' | Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Yanamala | Sakshi
Sakshi News home page

'టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట'

Published Wed, Feb 19 2020 11:12 AM | Last Updated on Wed, Feb 19 2020 11:17 AM

Vijaya Sai Reddy Slams Chandrababu Naidu And Yanamala - Sakshi

సాక్షి, అమరావతి: అధికారం చాటున చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయట పడుతూ ఉండటంతో, ప్రజల దృష్టిని మరల్చేందుకు కొత్త నాటకాన్ని మొదలు పెట్టారని, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో 'పదవి పోయిన తర్వాత కూడా చంద్రబాబు తన మాజీ పీఎస్‌తో రోజుకి పదిసార్లు మాట్లాడేవాడట. ఆ కాల్ లిస్టు బయటకు తీస్తే దోపిడీ సొమ్ము సర్దుబాట్లపై మరింత సమాచారం బయటికొస్తుంది. రూ. 2వేల కోట్ల అక్రమార్జన నుంచి దృష్టి మరల్చేందుకే ప్రజా చైతన్య యాత్ర అంటూ కొత్త నాటకం మొదలెట్టాడు' అంటూ ట్వీట్‌ చేశారు. (చదవండి: ర్యాంకింగ్స్ ఇస్తే ఆయనకు ఆఖరి స్థానం కూడా కష్టమే)

కాగా మరో ట్వీట్‌లో శాసనమండలిలో టీడీపీ నేత యనమల రామకృష్ణుడు ప్రవర్తించిన తీరుపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'కాలం చెల్లిన యనమల ఎత్తుగడలను గుడ్డిగా నమ్మిన బాబు కౌన్సిల్‌నే బలి పెట్టారని టీడీపీ ఎమ్మెల్సీలు వాపోతున్నారట. రద్దు అనేది లాంఛనమే అని వాళ్లకి అర్థమైంది. కౌన్సిల్ పోతే మిగిలిన పదవీ కాలం జీతభత్యాలు చెల్లిస్తానన్న హామీని బాబు నిలబెట్టుకోవాలని డిమాండు చేస్తున్నారట' అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

చదవండి: ఆయన పత్తిగింజని నమ్మించడానికి ఏ స్థాయికైనా..!

              బాబు తిప్పిన చక్రాలు ఏమయ్యాయో?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement