దాడిశెట్టి రాజా
సాక్షి, తూర్పుగోదావరి: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోను రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకూ సరైనదో టీడీపీ నేత యనమల రామకృష్ణుడి విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సహాయ చర్యల కోసం మీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్‌కు ఒక మెసెజ్ అయిన ఇవ్వగలిగారా? అని ప్రశ్నించారు. మీ అధినేత ఓటుకు నోటు కేసులో హైదరాబాదు వదిలి కరకట్ట మీదకు పారిపోయి వచ్చాడని ఎద్దేవా చేశారు. (ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం)
అయితే ఇప్పుడు కరోనా వచ్చిందని కరకట్ట వదిలి హైదరాబాదుకు పారిపోయి ఇంట్లో దాక్కున్నారని ఆయన విమర్శించారు. ముందు తమ వెనకాల ఉన్న మచ్చలు చూసుకుని ఎదుటి వారిని మిమర్శిస్తే బాగుంటుందని హితవు పలికారు. కరోనాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చంద్రబాబును వచ్చి చాడమనండి అని ధ్వజమెత్తారు. కాగా దేశ మొత్తం మీద కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంటోన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ ఏపీకి తండ్రిలాంటి వారని ప్రజలకు తండ్రిలా ధైర్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment