Dhadisetti Raja
-
కరకట్ట వదిలి హైదరాబాద్‌కు పలాయనం..
సాక్షి, తూర్పుగోదావరి: కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోను రాజకీయాలు మాట్లాడటం ఎంతవరకూ సరైనదో టీడీపీ నేత యనమల రామకృష్ణుడి విజ్ఞతకే వదిలేస్తున్నానని ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా సహాయ చర్యల కోసం మీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేడర్‌కు ఒక మెసెజ్ అయిన ఇవ్వగలిగారా? అని ప్రశ్నించారు. మీ అధినేత ఓటుకు నోటు కేసులో హైదరాబాదు వదిలి కరకట్ట మీదకు పారిపోయి వచ్చాడని ఎద్దేవా చేశారు. (ధైర్యంగా పోరాడదాం కరోనాను ఓడిద్దాం) అయితే ఇప్పుడు కరోనా వచ్చిందని కరకట్ట వదిలి హైదరాబాదుకు పారిపోయి ఇంట్లో దాక్కున్నారని ఆయన విమర్శించారు. ముందు తమ వెనకాల ఉన్న మచ్చలు చూసుకుని ఎదుటి వారిని మిమర్శిస్తే బాగుంటుందని హితవు పలికారు. కరోనాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చంద్రబాబును వచ్చి చాడమనండి అని ధ్వజమెత్తారు. కాగా దేశ మొత్తం మీద కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా ఎదుర్కొంటోన్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. సీఎం జగన్ ఏపీకి తండ్రిలాంటి వారని ప్రజలకు తండ్రిలా ధైర్యం ఇస్తున్నారని ఆయన పేర్కొన్నారు. -
అవినీతి, అరాచకమే టీడీపీ అజెండా
తొండంగి (తుని) :రాష్ట్రంలో అవినీతి, అరాచకమే ప్రధాన అజెండాగా చేసుకుని టీడీపీ ప్రభుత్వ పాలన సాగించిందని వైఎస్సార్ సీపీ తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు. బెండపూడిలో బుధవారం ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సమక్షంలో వైఎస్సార్ సీపీ నాయకుడు మద్దుకూరి వీర వెంకట సత్యనారాయణ(పెద్దబ్బు) ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన గ్రామ మాజీ ఉపసర్పంచ్ పాలచెర్ల జోగినాథం(బాబూరావు) పాలచెర్ల రామారావు, బూసాల చెల్లయ్య, కొరా శివన్నారాయణ, గొపిశెట్టి బాపిరాజు, చక్కా సింహాచలం, ఎడాల నూకరాజు, షేక్ మీరా సాహేబ్, షేక్ బుజ్జి, తదితరులతో పాటు మరో 200 మంది వైఎస్సార్సీపీ చేరారు. ఈ సందర్బంగా సభలో ఎమ్మెల్యే రాజా మాట్లాడుతూ రైతులు, మహిళలు, యువతకు, అన్నిరంగాలకు మేలు చేస్తానని ఎన్నికల హామీలిచ్చిన చంద్రబాబు దాదాపు నాలుగేళ్లుగా అవినీతి, అరాచకమే అజెండాగా పాలన సాగించారన్నారు. చంద్రబాబు అవినీతి కారణంగా కేంద్రం ప్రకటించిన ప్రత్యేక హోదా సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. వైఎస్సార్సీపీ అధినేత, జననేత జగన్‌తోపాటు పార్టీ నాయకులు అభిమానులు కూడా ప్రత్యేక హోదా కోసం ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రజల సమస్యల పరిష్కారం, అవినీతి, అరాచక పాలను చరమ గీతం పాడాలంటే కేవలం జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. పార్టీ చేరిక కార్యక్రమానికి ప్రత్తిపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ పర్వత పూర్ణచంద్రప్రసాద్ హాజరై మాట్లాడుతూ టీడీపీ పాలనపై ప్రజలు, అన్నివర్గాల ప్రజలు విసుగుచెంది ఉన్నారన్నారు. అన్ని పార్టీల నేతలు రానున్న కాలంలో వైస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారన్నారు. పార్టీలో చేరిన వారందరినీ ఎమ్మెల్యే రాజా కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోతుకూరి వెంకటేష్, మండల కన్వీనర్ బత్తుల వీరబాబు, మండల యూత్ కన్వీనర్ ఆరుమిల్లి ఏసుబాబు, పార్టీ మండల నాయకులు మద్దుకూరి వీరవెంకట రామయ్య చౌదరి(చిన్నబ్బు), జిల్లా కమిటీ సభ్యుడు నాగం గంగబాబు, తొండంగి సొసైటీ ఉపాధ్యక్షుడు వనపర్తి సూర్యనాగేశ్వరరావు, చిన్నాయపాలెం సర్పంచ్ ములికి రామకృష్ణ, ఉపసర్పంచ్ దూళ్లిపూడి ఆంజనేయులు, బెండపూడి ఎంపీటీసీ సభ్యులు కోనాల కుమారి, బూసాల వెంకటరమణ, మాజీ సర్పంచ్ కోనాల రాములు, సాపిశెట్టి చిన్న, బెండపూడి హైస్కూలు విద్యా కమిటీ చైర్మన్ బూసాల గణపతి, బూర్తి కృష్ణ, వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ విభాగం కన్వీనర్ శివకోటి ప్రకాష్, యాదాల రాజబాబు, గాబు రాజు, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు వీరే
హైదరాబాద్: రాష్ట్రంలోని పార్లమెంట్ నియోజకవర్గాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియామకాలు జరిగినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలిపింది. వైఎస్సార్సీపీ పార్లమెంట్ పరిశీలకులు వీరే శ్రీకాకుళం- బేబీ నయిన విజయనగరం- బి.చంద్రశేఖర్ అరకు- బి. ప్రసాద్ విశాఖ- దాడిశెట్టి రాజా అనకాపల్లి- ఆదిరెడ్డి అప్పారావు కాకినాడ- ముత్యాలనాయుడు రాజమండ్రి- పేర్ని నాని అమలాపురం- కరణం ధర్మశ్రీ నరసాపురం- వేణుగోపాల్ ఏలూరు- పిల్లి సుభాష్ చంద్రబోస్ విజయవాడ- ఆదిశేషగిరిరావు మచిలిపట్నం- ఉమ్మారెడ్డి రమణ తిరుపతి- ఎల్లసిరి గోపాల్ రెడ్డి చిత్తూరు-పి. రవీంద్రనాథ్ రెడ్డి అనంతపురం- డీసీ గోవిందరెడ్డి హిందూపూర్- మిథున్‌రెడ్డి కర్నూలు- సురేష్‌బాబు నంద్యాల- గుర్నాథరెడ్డి కడప- వైఎస్ అవినాశ్‌రెడ్డి రాజంపేట- దేవగుడి నారాయణరెడ్డి