6 నుంచి అసెంబ్లీ | Assembly from 6th | Sakshi
Sakshi News home page

6 నుంచి అసెంబ్లీ

Published Sat, Mar 4 2017 2:46 AM | Last Updated on Tue, Oct 2 2018 4:53 PM

6 నుంచి అసెంబ్లీ - Sakshi

6 నుంచి అసెంబ్లీ

వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో శాసన సభ, మండలి సమావేశాలు సోమవారం

సోమవారం ఉ. 11.06 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం
26వ తేదీతో నోటిఫికేషన్‌ జారీ చేసిన శాసనసభ సచివాలయం


సాక్షి, అమరావతి: వెలగపూడిలోని  తాత్కాలిక సచివాలయం ప్రాంగణంలో నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ భవనంలో శాసన సభ, మండలి సమావేశాలు సోమవారం (6వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 11.06 నిమిషాలకు గవర్నర్‌ నరసింహన్‌ ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు.  ఈ మేరకు అసెంబ్లీ సచివాలయం శుక్రవారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది. అయితే, గత నెల 26వ తేదీతో ఈ నోటిఫికేషన్‌ను జారీ చేయడం వివాదంగా మారింది. పాత తేదీతో  నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని అధికార యంత్రాంగం తప్పుపడుతోంది.

13న బడ్జెట్‌: సోమవారం గవర్నర్‌ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. వాయిదా పడిన తరువాత లేదా మంగళవారం శాసన సభా వ్యవహారాల కమిటీ సమావేశమవుతుంది. సమావేశాలు ఎప్పటివరకు నిర్వహించాలి, ఏ ఏ అంశాలను చర్చకు చేపట్టాలో ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2017–18) వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 13వ తేదీన అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement