అమరావతిలో డీజీపీ కార్యాలయానికి నో బ్లాక్! | No block to the DGP office in Amravati | Sakshi
Sakshi News home page

అమరావతిలో డీజీపీ కార్యాలయానికి నో బ్లాక్!

Published Wed, Jun 22 2016 8:16 AM | Last Updated on Mon, Sep 4 2017 3:02 AM

No block to the DGP office in Amravati

తాత్కాలిక సచివాలయంలో ప్రత్యేక బ్లాక్ కోరిన డీజీపీ
2.80 లక్షల చదరపు అడుగులు కావాలని ప్రభుత్వానికి వినతి

విజయవాడ: అమరావతిలో డీజీపీ కార్యాలయం ఏర్పాటు సందిగ్ధంలో పడింది. వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలిక సచివాలయంలో రాష్ట్ర పోలీసు శాఖ ప్రత్యేకంగా ఒక బ్లాక్ కోరింది. సచివాలయం ఉద్యోగుల తరలింపు, కార్యాలయాల ఏర్పాటుపై పూర్తిగా స్పష్టత రాకపోవడంతో పోలీసుల ప్రతిపాదన పెండింగ్‌లో పడింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో పోలీసు అధికారులు నిమగ్నమయ్యా రు. ఈ క్రమంలో విజయవాడలో డీజీపీ కార్యాలయం ఏర్పాటుచేయడానికి అనువుగా ఉండే భారీ భవన సముదాయాల కోసం అన్వేషిస్తున్నారు. హైదరాబాద్ నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాల తరలింపుతోపాటు డీజీపీ కార్యాలయం తరలించాలని పోలీసు ఉన్నతాధికారులు భావించారు.  పోలీసు శాఖ పరంగా విభజన పూర్తికాకపోవడంతో డీజీపీసహా ఉన్నతాధికారులు హైదరాబాద్‌లోనే కొనసాగుతున్నారు. ఈ పరిణామాల క్రమం లో ముఖ్యమంత్రి విజయవాడలో ఉండడంతో ఉన్నతాధికారులు అందరూ ఎక్కువ  రోజులు విజయవాడలోనే కొనసాగుతున్నారు. ఇతర ప్రభుత్వ శాఖల మాదిరిగానే తాత్కాలికంగా డీజీపీ కార్యాలయం విజయవాడలో ఏర్పాటుచేయాలని డీజీపీ జె.వి.రాముడు నిర్ణయిం చా రు. ఈక్రమంలో తాత్కాలిక సచివాల యంలో ఒక బ్లాక్‌ను పూర్తిగా పోలీసులకు కేటాయించాలని  నెలకిందట ప్రభుత్వానికి విన్నవించారు.

పోలీసుశాఖకు 2.80 లక్షల చదరపు విస్తీర్ణం కేటాయించాలని రాతపూర్వకంగా ప్రభుత్వాన్ని కోరారు. డీజీపీ కార్యాలయంతోపాటు దీనికి అనుబంధంగా ఉండే సుమారు పది విభాగాలను అక్కడ ఏర్పాటుచేయాలని భావించారు. డీజీపీ కార్యాలయంలో అన్ని విభాగాలు కలిపి ఉన్నతాధికారులు, మినిస్టీరియల్ స్టాఫ్ సుమారు 800 మంది వరకు ఉంటారు. డీజీపీ కాకుండా అదనపు డీజీపీలు ఐదుగురు, ఐజీస్థాయి అధికారులు ఆరుగురు, ఎస్సీ, డీఐజీ స్థాయి అధికారులు ఏడుగురు ఉంటారు.  కార్యాలయంలో ఏ నుంచి ఈ వరకు సెక్షన్లు, సీఐడీ విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం, డెరైక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ విభాగం, ఏపీఎస్పీ కార్యాలయం, పోలీ సు హౌసింగ్ కార్పొరేషన్, ఆక్టోపస్, గ్రేహౌండ్స్, పోలీసు కమ్యూనికేషన్, కౌంటర్ ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్, ఐఎస్‌డబ్ల్యూ ఇంటెలిజెన్స్, పోలీసు ట్రాన్స్‌పోర్టు, ఫోరెన్సిక్, ప్రింటింగ్, స్టోర్స్ ఇలా పలువిభాగాలు ఉన్నాయి. కార్యాల యా న్ని డీజీపీ కార్యాలయానికి అనుబంధంగా హైదరాబాద్ లో ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. తాత్కాలికంగా డీజీపీ కార్యాలయాన్ని సచివాలయంలో ఏర్పాటుచేస్తే డీజీపీతోపాటు ఈ శాఖలన్నీ తరలివచ్చేలా ఏర్పాటుచేశారు.   ప్ర భుత్వం నుంచి స్పష్టత రాకపోవడం, నిర్మిస్తు న్న తాత్కాలిక సచివాలయం పూర్తిగా సచివాల య ఉద్యోగులకు సరిపోనుండటంతో పోలీసులకు ప్రభుత్వం మొండిచెయ్యి చూపింది. ప్రత్యామ్నాయఅన్వేషణలోనిమగ్నమయ్యారు. 

 
విజయవాడలో అన్వేషణ

విజయవాడలో ఎకరంపైగా విస్తీర్ణంలో ఉన్న అద్దె భవనాన్ని పోలీసు అధికారులు అన్వేషిస్తున్నారు. కొద్దిరోజుల్లో పుష్కరాలు రానుం డటం, విజయవాడలోనే సీఎం కార్యకలాపాలు ఉండటంతో అద్దె భవనంలో అయి నా కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని  భావిస్తున్నారు. విజయవాడతోపాటు భవానీపురం, శివారు ప్రాంతాలైన పోరంకి, పెనమలూరు, రామవరప్పాడుల్లో అన్వేషిస్తున్నారు.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement