తుళ్లూరు: గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడిలో నిర్మాణమవుతున్న తాత్కాలిక సచివాలయం నుంచి జూన్ 25 తర్వాత పాలన కొనసాగుతుందని, దీనికి సంబంధించి 11,500 మంది ఉద్యోగులను తరలిస్తున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. శనివారం వెలగపూడిలో నిర్మిస్తున్న తాత్కాలి సచివాలయ పనులను ఆయన పరిశీలించారు. ఇటీవల జరిగిన ఓ కార్మికుడి మృతి ఘటనపై ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. సచివాలయం పనులు నిలిచిపోయాయని ప్రచారం జోరుగా చేస్తున్నారన్నారు. ఇది ప్రతిపక్షాలకు ఇది మంచి పద్ధతి కాదని సూచించారు. ముఖ్యంగా ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో రాజకీయం చేస్తుందని, దీనికి పూర్తి బాధ్యత ఆ పార్టీదేనని తెలిపారు. గతంలో హామీ ఇచ్చిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ విషయంపై ఎద్దేవా చేయడం సరైంది కాదన్నారు.
జూన్ 25 తర్వాత వెలగపూడి నుంచే పాలన
Published Sat, May 14 2016 8:54 PM | Last Updated on Mon, Sep 4 2017 12:06 AM
Advertisement