అక్టోబర్ 3.. వెలగపూడి నుంచే పరిపాలన
* అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు
* ఫైళ్లు, కంప్యూటర్ల తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచే పరిపాలన సాగించాలని సాధారణ పరిపాలన శాఖ(జీఏడీ) మంగళవారం అన్ని శాఖల కు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు అక్టోబర్ 3వ తేదీని ముహూర్తంగా ఖరారు చేసిం ది. సచివాలయ ఉద్యోగులంతా అక్టోబర్ 3 నుంచి వెలగపూడిలో పనిచేయాల్సి ఉన్నం దున ఫైళ్లు, కంప్యూటర్లను హైదరాబాద్ నుంచి తరలించేందుకు ప్యాకింగ్ చేయాలని జీఏడీ సూచించింది. ఈ నెల 21వ తేదీ నుంచే తరలింపు ప్రక్రియ ప్రారంభించాలని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ముఖ్యమైన వివరాలు ఇలా ఉన్నాయి..
హా ఈ నెల 30వ తేదీకల్లా హైదరాబాద్ సచివాలయంలోని ఫైళ్లు, కంప్యూటర్లను వెలగపూడికి తరలించాలి.
హా వచ్చే నెల 1, 2 తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలైనందున 3 నుంచి పూర్తిస్థాయిలో వెలగపూడి నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుంది. సంబంధిత అధికారులు గడువులోగా ఏర్పాట్లను పూర్తిచేసుకోవాలి.
హా హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులకు బదిలీ రవాణా భత్యం(టీటీఏ) వర్తిస్తుంది.
హా తాత్కాలిక సచివాలయంలో సెంట్రల్ రికార్డ్ సిస్టమ్ (సీఆర్‌ఎస్)ను ఏర్పాటు చేసిన తర్వాతే హైదరాబాద్‌లో ఉన్న సీఆర్‌ఎస్‌ను వెలగపూడికి తరలిస్తారు. ఇందుకు సంబంధించిన పర్యవేక్షణ కోసం జీఏడీ కార్యదర్శి అధ్యక్షతన కమిటీ ఏర్పాటవుతుంది.
హా హైకోర్టు, లోకాయుక్త, ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్ (ఏపీఏటీ) వంటి చట్టబద్ధ సంస్థల వ్యవహారాలను చూసేందుకు ఒక్కో విభాగం నుంచి అవసరాన్ని బట్టి ఒకరిద్దర్ని ఇక్కడే ఉంచేలా జీఏడీ కార్యదర్శి చర్యలు తీసుకుంటారు. ఈ మేరకు సచివాలయ తరలింపు షెడ్యూల్, మార్గదర్శకాలతో ప్రభుత్వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాష్ టక్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.