
సాక్షి, అమరావతి: ప్రజలు ఛీకొట్టినా... తన యజమాని కోసం కిరసనాయిలు పిచ్చి రాతలు రాస్తున్నాడంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఎల్లోమీడియా తీరుపై విరుచుకుపడ్డారు. తమ కులదైవం చంద్రబాబు నాయుడు ఉనికి కోల్పోవడం చూడలేక దృష్టి మళ్లించే కథనాలు వదులుతున్నాడని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం కిరసనాయిలుకు సెటిల్మెంట్ల ఆదాయం పోయిందని ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదే విధంగా టీడీపీ నేత యనుమల రామకృష్ణుడు తీరుపై కూడా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘యనమల గారు కూడా నీతి బోధలు చేస్తున్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన కుట్రలో ఈయన ప్రధాన భాగస్వామి. అప్పటి పల్లకీ సేవకు తన బంధువులకు అనేక పదవులు, వేల కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకున్నాడు. కులజ్యోతి రాసిన కడుపు మంట వార్తను పట్టుకుని పత్తిగింజ కబుర్లు చెబుతున్నాడు’ అని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.(చదవండి: అంతమాట అంటారా?)
అదే విధంగా అసెంబ్లీ ప్రాంగణం వద్ద టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ వ్యవహరించిన తీరుపై విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. ‘అసెంబ్లీలో మొహం చెల్లక పోవడంతో ప్రచారం కోసం గేటు దగ్గర గలాభా సృష్టించాలని చూశాడు. లక్షల కోట్లు దోచుకున్న పొగరుతో మాలోకం మార్షల్ గొంతు పట్టుకుని దుర్భాషలాడిన వీడియోలు అందరూ చూశారు. ప్రచారం కోసం ఇలాంటి ఛీప్ ట్రిక్కుల మీద ఎన్నాళ్లు బాబూ’అని ట్విటర్ వేదికగా ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment