సాక్షి, విజయనగరం: ప్రభుత్వం ధనార్జన కోసం చూస్తుందన్న విమర్శలను మంత్రి బొత్స సత్యనారాయణ ఖండించారు. టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నేతలు ఏం సాధించాలని ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు,యనమల కలిసి రాష్ట్రాన్ని దివాళా తీసేలా చేశారని ధ్వజమెత్తారు. (ఏపీలో అత్యధిక ‘కరోనా టెస్టులు’ చేసింది అక్కడే..)
కరోనా కష్టకాలంలో ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసిందన్నారు. కమీషన్లు కోసం కక్కుర్తి పడటం టీడీపీ నేతల బుద్ధి అని ధ్వజమెత్తారు. మద్య నిషేధం తమ ఉద్దేశమని, అందులో భాగంగానే ధరలు పెంచామని వివరించారు. అదేవిధంగా మద్యం తాగేవారిని తగ్గించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ప్రజల యోగక్షేమాలు టీడీపీ నేతలకు అవసరం లేదా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. రాష్ట్రం దివాళా తీయాలని టీడీపీ నేతలు కోరుకుంటున్నారా అని మండిపడ్డారు. నిత్యావసర వస్తువుల ధరల పెరగకుండా రూ.3వేల కోట్ల ప్రత్యేక నిధి ద్వారా నియంత్రణ చేస్తున్నామని తెలిపారు. (తండ్రి చాటున దాక్కుని రాళ్లు విసరడమా?)
Comments
Please login to add a commentAdd a comment