సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్ ఖాతాలో.. 'పోతిరెడ్డిపాడు పనులు నిలిపివేయాలని గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశిస్తే ఒక్క మాట మాట్లాడలేదు. ప్రభుత్వం కంటే ముందే తమ పార్టీ కోర్టుకెళ్తుందని బాబు అని ఉంటే ప్రజల పట్ల అంతో ఇంతో బాధ్యత ఉందని అనిపించేది. పట్టించుకోనవసరం లేని వ్యక్తుల కోసం న్యాయ పోరాటాలు చేసి పరువు తీసుకుంటున్నాడు' అంటూ ట్వీట్ చేశారు. చదవండి: 'చిటికెలేసే వ్యక్తి ఇలా డ్రామాలాడటం నీచాతినీచం'
కాగా మరో ట్వీట్‌లో.. 'నిన్న యనమల స్టేట్‌మెంట్‌తో ఒక విషయం వందోసారి స్పష్టమైంది. టీడీపీకి ప్రజాస్వామ్యం, ప్రజల మీద ఏమాత్రం నమ్మకం లేదు. ఉన్న నమ్మకాలన్నీ నిమ్మగడ్డ మీదే' అంటూ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. చదవండి: 'ఎమ్మెల్యేల కాళ్లు పట్టుకునే పనిలో పడ్డాడు'
Comments
Please login to add a commentAdd a comment