సాక్షి, అమరావతి: కరోనా వ్యాధి నియంత్రణ కోసమే ముందస్తు చర్యగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశామని ఈసీ చెప్తున్న నేపథ్యంలో వాయిదా పడిన స్థానిక ఎన్నికలను కేంద్ర బలగాల సాయంతో నిర్వహించాలంటూ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు చేస్తున్న డిమాండ్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్విటర్ వేదికగా స్పందించారు. 'స్థానిక సంస్థల ఎన్నికలు కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలంటూ యనమల గారు డిమాండ్ చేయడం చూస్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విజయసాయి ఎద్దేవా చేశారు. సీబీఐని నిషేధించినవాళ్లు, కేంద్ర బలగాలకు వ్యతిరేకంగా మాట్లాడినవాళ్లు ఇప్పుడు నాలుక మడతేస్తున్నారు అంటూ విమర్శించారు. మీలాంటి ప్రజాకంటకుల వల్ల ఏం ప్రయోజనం, అనవసర ఖర్చులు తప్ప' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చదవండి: ‘ఆ విద్యార్ధులను తీసుకురండి’
కాగా మరో ట్వీట్‌లో.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. 'చంద్రబాబునే ఇప్పటికీ సీఎంగా ఊహించుకునే వారు అకారణంగా భయభ్రాంతులకు గురవడం, తమకు రక్షణ లేదని పీడ కలలు కనడంలో వింతేమీ లేదు. తమ యజమానికి ఇప్పటికీ ఏదో విధంగా సేవ చేయడానికి నానా తంటాలు పడుతుంటారు. లేఖలు, లీకులు అందులో భాగమే' అని చెప్పారు. చదవండి: ఏప్రిల్ 14న ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ
Comments
Please login to add a commentAdd a comment