
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. కరోనా పేరు చెప్పి ఏకపక్షంగా స్థానిక ఎన్నికలను వాయిదా వేసిన ఎస్‌ఈసీ తీరుపై ట్విటర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘చంద్రబాబు సీఎంగా లేని రాష్ట్రంలో ప్రజలు ప్రశాంతంగా ఉండటానికి వీల్లేదని వ్యవస్థల్లోకి ఆయన చొప్పించిన ‘స్లీపర్ సెల్స్’ కరాఖండీగా చెబుతున్నాయి. దేశం కంటే కులమే గొప్పది. మాదేవుడు బాబు అంతకంటే పెద్దోడు. ఆర్థిక సంఘం నిధులు 5 వేల కోట్లు రాకపోతే మాకేంటి అంటున్నాయి ఈ ‘నిద్రాణశక్తులు’ అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు.
మరో ట్వీట్‌లో.. ‘ఉగ్రవాద సంస్థలు తాము టార్గెట్ చేసిన వ్యవస్థలను విచ్ఛినం చేయడానికి మోల్స్(ద్రోహులు), కోవర్టులు, స్లీపర్ సెల్స్‌ను ప్రవేశపెడతాయి. ప్రజా సంక్షేమం కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన చోట ఇలా ద్రోహులను జొప్పించడం, అదను చూసి వారు విధ్వంసానికి తెగబడటం, టెర్రర్ గ్రూపుల కంటే ఘోరం కాదా?’ అని ఆయన ట్వీట్ చేశారు.
(చదవండి: ‘కుల పెద్దకు శరణ్యమన్నాడు. ఎవరిని నమ్మాలి’)
(ఎన్నికల కమిషనర్‌ను వివరణ కోరిన గవర్నర్)
(హైకోర్టులో దాఖలైన లంచ్‌మోషన్ పిటిషన్)
Comments
Please login to add a commentAdd a comment