
సాక్షి, అమరావతి : మే 23న జరిగే కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. సీఈవో గోపాలకృష్ణ ద్వివేది, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌లు సమీక్షకు హాజరయ్యారు. జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్‌కు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించారు.