strong rooms
-
స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఐదు అంచెల భద్రత
-
స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పటిష్ట బందోబస్త్
-
స్ట్రాంగ్ రూమ్స్ లో ఈవీఎంలు...
-
నేడు జగిత్యాల ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ ను తెరవనున్న అధికారులు
-
స్ట్రాంగ్ రూమ్‌ల దగ్గర భద్రత కట్టుదిట్టం
-
ఈవీఎంలపై ఫిర్యాదులకు ఈసీ హెల్ప్‌లైన్
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలపై వచ్చే ఫిర్యాదులపై స్పందించేందుకు 24 గంటలపాటు పనిచేసే కంట్రోల్‌రూమ్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) ఏర్పాటు చేసింది. ఎన్నికల్లో ఉపయోగించిన అసలైన ఈవీఎంల స్థానంలో కొత్త వాటిని స్ట్రాంగ్ రూమ్‌ల్లో పెట్టి, వాటిలోని ఓట్లనే లెక్కించనున్నారన్న ఆరోపణలు రావడం, అవన్నీ అవాస్తవాలేనని ఈసీ మంగళవారం కొట్టిపారేయడం తెలిసిందే. అయితే స్ట్రాంగ్ రూమ్‌ల్లో ఈవీఎంలను భద్రపరిచిన తీరు, స్ట్రాంగ్ రూమ్‌లకు కల్పించిన భద్రత, స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద తమ ఏజెంట్లను నియమించేందుకు అభ్యర్థులకు అనుమతి, ఆ పరిసరాలపై సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టడం, ఈవీఎంల తరలింపు సహా ఈవీఎంలకు సంబంధించిన ఏ సమస్యలపైనైనా ఫిర్యాదులు చేయవచ్చని ఈసీ వెల్లడించింది. ఈ ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా ఐదు లైన్లతో హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశామనీ, ఫిర్యాదుదారులు 011–23052123 నంబర్‌కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని ఈసీ తెలిపింది. -
నిఘా ‘గుడ్డి’దేనా!
పటాన్‌చెరుటౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల పరిధిలోని ముత్తంగి ఆర్ఆర్ఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పటాన్చెరు, అమీన్పూర్, గుమ్మడిదల, జిన్నారం మొత్తం నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల స్ట్రాంగ్ రూమ్ వద్ద సీసీ కెమెరాలు నామమాత్రంగా పనిచేస్తున్నాయి. రికార్డు కాని డేటా.. మొత్తం హార్డ్‌డిస్క్ 931.51 జీబీ ఉండగా మొత్తం 931.51జీబీ ఫుల్ కావడంతో ఫ్రీ స్పేస్ లేదని డిస్ప్లేలో చూయిస్తుంది. ఈ విషయాని గమనించిన అధికారులు గత శుక్రవారం సీసీ కెమెరాల స్టోరేజీ పెంచాలనీ నిర్వాహకులకు సూచించారు. అయితే వారు స్టోరేజీ పెంచకుండా అలాగే వదిలి వేశారు. దీంతో డేటా రికార్డు కాకుండా సీసీ కెమెరాలు ఉన్నాయి అంటే ఉన్నాయి అన్నట్లుగా ఉంది. ఇదే హార్డ్‌డిస్క్ స్టోరేజీ విషయంపై అధికారుల వివరణ కోరగా ఇప్పటికే ఈ విషయాని నిర్వహకులకు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు వారు బాగుచేయలేదని చెబుతున్నారు. -
లోక్‌సభ ఓట్ల కౌంటింగ్‌కు చకచకా ఏర్పాట్లు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడుతోంది. ఈ నెల 23వ తేదీన ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్‌కు కేవలం నాలుగు రోజులు మాత్రమే గడువు మిగిలి ఉంది. దీంతో అటు అభ్యర్థులు, ఆయా పార్టీల నేతలు, ప్రజలు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఓట్ల లెక్కింపునకు జిల్లా ఎన్నికల అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సూపర్ వైజర్లకు, కౌంటింగ్ అసిస్టెంట్లకు శిక్షణ ఇవ్వడం పూర్తయ్యింది. ఎలాంటి వివాదాలకు తావులేకుండా కౌంటింగ్ ప్రక్రియను వీడియో రికార్డు చేయనున్నారు. ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు అందితే వెబ్ కాస్టింగ్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని అధికార వర్గాలు చెబుతున్నాయి. నల్లగొండ లో క్‌సభ స్థానానికి ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరగగా 15,85,433 మంది ఓటర్లకు గాను.. 11,75,129 మంది ఓ టర్లు (74.12 శాతం )తమ ఓట్లు హక్కు వినియోగించుకున్నారు.మిర్యాలగూడ రోడ్డులోని దుప్పలపల్లిలోని వేర్‌హౌస్ గోదాముల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. పార్టీల ఏజెంట్లు అంతా 6.30 గంటల వరకే కౌంటింగ్ కేంద్రం వద్దకు చేరుకుంటారు. వారి సమక్షంలోనే స్ట్రాంగ్ రూమ్‌ల సీల్‌ను తీస్తారు. ఆ తర్వాత స్ట్రాంగ్ రూమ్‌ల నుంచి కౌంటింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తీసుకొస్తారు. అదంతా వీడియో రికార్డింగ్ జరుగుతుంది. కాగా, 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 14 టేబుళ్లు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు గాను ఒక్కో ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఆర్ఓ టేబుల్ వద్దనే లెక్కిస్తారు. ఆ తర్వాత ఆయా నియోజకవర్గాల వారీగా 14 టేబుళ్లలో ఈవీఎంలలో ఉన్న ఓట్లను లెక్కిస్తారు. ఒక్కో టేబుల్‌కు ఒక కౌంటింగ్ సూపర్వైజర్తో పాటు ఒక కౌంటింగ్ అసిస్టెంట్ ఉంటారు. వీడియో రికార్డింగ్‌తో పాటు మైక్రో అబ్జర్వర్ కూడా ఓట్ల లెక్కింపు వద్ద ఉండి పరిశీలిస్తారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 1990 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. పోలైన ఓట్లను మొత్తంగా 144రౌండ్లలో లెక్కిస్తారు. ఒక్కో నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ స్టేషన్ల ఆధారంగా కౌంటింగ్ కొనసాగుతుంది. దేవరకొండ నియోజకవర్గంలో 308 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక్కడ 22 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుండగా, నాగార్జున సాగర్‌లో 293 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. అవి 21 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. అదే విధంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో 256 పోలింగ్ స్టేషన్లు 19 రౌండ్లలో, హజూర్‌నగర్ నియోజకవర్గంలోని 302 పోలింగ్ స్టేషన్లు 22 రౌండ్లలో, కోదాడలోని 286 పోలింగ్ స్టేషన్లు 21 రౌండ్లలో, సూర్యాపేటలో 264 పోలింగ్ స్టేషన్లు 19 రౌండ్లలో పూర్తవుతుండగా నల్లగొండ నియోజకవర్గంలో 281 పోలింగ్ కేంద్రాలు ఉండగా 20 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ పూర్తికానుంది. అంటే ఒక గంటలో 3 నుంచి 4 రౌండ్ల కౌంటింగ్ పూర్తయినా.. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాతే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈవీఎంల తర్వాత వీవీప్యాట్ల లెక్కింపు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 ఈవీఎంలకు సంబంధించిన వీవీ ప్యాట్ల స్లిప్పులను లెక్కించనున్నారు. అవి కూడా డ్రా పద్ధతిన ఎంపిక చేసి వీవీ ప్యాట్లలోని స్లిప్పులను లెక్కిస్తారు. ఆతర్వాత కౌంటింగ్ పూర్తవుతుంది. కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్గౌరవ్ ఉప్పల్ అధికారులను ఆదేశించారు. శనివారం దుప్పలపల్లి గోదామును జాయింట్ కలెక్టర్ వి.చంద్రశేఖర్‌తో కలిసి సందర్శించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు. ఈనెల 23న కౌంటింగ్ నిర్వహించనున్నందున సత్వరం ఏర్పాట్లు చేయాలని, ఈ నెల 21న ఈసీఐ డ్రెస్ రిహార్సల్స్ నాటికి కౌంటింగ్ హాల్లలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. రిటర్నింగ్ అధికారి గదిలో పోస్టల్ బ్యాలెట్, ఈటీపీబీఎస్, సర్వీస్ ఓటర్ల లెక్కింపు ఏర్పాట్లపై చర్చించారు. నియోజకవర్గాల వారీగా కౌంటింగ్ హాల్లు పర్యటించి చేయాల్సిన ఏర్పాట్లపై చర్చిస్తూ, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందికి వేర్వేరుగా దారులు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. కౌం టింగ్ సెంటర్ పెయిడ్ క్యాంటీన్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. పారి శుద్ధ్యం, పరిశుభ్రత చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కౌంటింగ్ హాల్ వారీగా ఏర్పాట్లు జాయింట్ కలెక్టర్ పర్యవేక్షించాలని, మౌలిక వసతులు రిపోర్టింగ్, ఇతరత్రా జిల్లా రెవెన్యూ అధికా రి ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారివెంట డీఆర్ఓ రవీంద్రనాథ్, ఆర్డీఓ జగదీశ్‌రెడ్డి, సర్వే ఏడీ శ్రీనివాసులు, పంచాయతీ రాజ్ డీఈ నాగయ్య తదితరులు పాల్గొన్నారు. సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షించాలి నల్లగొండ : నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల కౌం టింగ్ ప్రక్రియను సజావుగా నిర్వహించేలా సూక్ష్మ పరిశీలకులు పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్అన్నారు. శనివారం జిల్లా కలెక్టర్ కా ర్యాలయంలో ఉదయాదిత్య భవన్లో కౌంటింగ్ ప్రక్రియపై పరిశీలనకు నియమించిన 140మంది సూక్ష్మ పరిశీలకులకు నియమించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సాధారణ పరిశీలకులు ధనంజయ్ దేవాంగన్ నాగార్జున సాగర్, దేవరకొండ, మిర్యాలగూడ, హుజూర్నగర్, ఎల్ఎస్కెన్ అదనపు పరిశీలకులు నల్లగొండ, కోదా డ, సూర్యాపేట అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ పరిశీలిస్తారని వివరించారు. ఎన్నికల పరిశీలకుల తరఫున సూక్ష్మ పరిశీలకులుగా నియమించిన బ్యాంక్, ఎల్ఐసీ, ఇతర ఉద్యోగులు కౌం టింగ్ రోజున బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్ఓ రవీంద్రనాథ్, నల్లగొం డ ఎల్డీఎం సూర్యం, సూర్యాపేట ఎల్డీఎం శ్రీనివాస్, జేడీఏ శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రం వద్ద విజిటింగ్ సంతకం చేస్తున్న కలెక్టర్ -
పరిశీలన పేరిట హైడ్రామా
సాక్షి, విశాఖపట్నం: ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంల భద్రతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఉరుకులు పరుగులు పెట్టారు. స్ట్రాంగ్ రూమ్ పరిశీలనకు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులను తీసుకెళ్లారు. సీల్ వేసిన మూడు నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌లను చూపించారు. ‘‘ఈవీఎం ఆ..భయం’’అనే శీర్షికన భద్రత డొల్లతనంపై ‘సాక్షి’లో వచ్చిన కథనంతో ఎన్నికల కమిషన్ కూడా తీవ్రంగాస్పందించింది. భద్రత విషయంలో తీసుకుంటు న్న చర్యలపై ఈసీ కూడా జిల్లా యంత్రాంగాన్ని ఆరా తీసినట్టుగా తెలియవచ్చింది. రౌండ్ ది క్లాక్ భద్రతను పర్యవేక్షించేందుకు తహసీల్దార్లను బదులు డిప్యూటీ తహసీల్దార్లను నియమించడంపై కూడా వివరణ కోరినట్టు సమాచారం. కాగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో స్ట్రాంగ్ రూమ్‌లను జేసీ–2 వెంకటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.గున్నయ్యల నేతృత్వంలో ఆదివారం సాయంత్రం స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలనకు తీసుకెళ్లారు. కానీ అక్కడ విధుల్లో ఉన్న బీఎస్ఎఫ్, సివిల్ పోలీసులు స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలనకు అనుమతించలేదు. స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రత విషయంలో పలు అపోహలు తలెత్తుతున్న నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్ ఆదేశించారని, పరిశీలనకు అనుమతించాలని కోరారు. తమ పై అధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని.. లోపలకు అనుమతించే ప్రసక్తే లేదని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బీఎస్ఎఫ్, సివిల్ పోలీస్ అధికారులు తెగేసి చెప్పారు. దీంతో రాజకీయ పార్టీలు, మీడియా ప్రతినిధులు రెండు గంటలపాటు పడిగాపులు కాయాల్సి వచ్చింది. ఇక అనుమతులు రావన్న భావనతో చాలా మంది మీడియా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నేతలు వెనుదిరిగి వెళ్లిపోయారు కూడా. చివరకు ఉన్నతాధికారుల ద్వారా ఆదేశాలు వచ్చిన తర్వాత సాయంత్రం ఆరు గంటలకు స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలనకు భద్రతా బలగాలు అనుమతిచ్చాయి. సీల్ వేసిన నర్సీపట్నం, యలమంచలి, అనకాపల్లి నియోజకవర్గాల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌లను చూపించి.. మిగిలిన నియోజకవర్గాల స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద తీసుకుంటున్న భద్రతా ఏర్పాట్లపై సీసీ కెమెరాల ద్వారా ఏ విధంగా పర్యవేక్షిస్తున్నదీ జేసీ–2, డీఆర్వోలు వివరించారు. చివరగా ఈవీఎంల భద్రత విషయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేశారని అధికారులే ప్రకటించారు. కానీ ఈసీ ఆదేశాలకు విరుద్ధంగా తహసీల్దార్ల స్థానంలో డీటీల నియామకంపై మాత్రం పెదవి విప్ప లేదు. స్ట్రాంగ్‌రూమ్‌లను పరిశీలించిన వారిలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పక్కి దివాకర్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్, సీపీఐ నగర కార్యదర్శి డి.లోకనా«థం, టీడీపీ, బీజేపీ నాయకులు పళ్ల రమణ, విజయానందరెడ్డి, డీవైఎఫ్ఐ నాయకుడు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పటిష్టమైన భద్రత కల్పించాం సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాతీర్పు నిక్షిప్తమైన ఈవీఎంలకు పటిష్టమైన భద్రత కల్పించినట్టు జిల్లా రెవెన్యూ అధికారి ఆర్.గున్నయ్య తెలిపారు. భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని చెప్పారు. రెవెన్యూ, పోలీస్ సిబ్బంది రౌండ్ ది క్లాక్ భద్రతను పర్యవేక్షిస్తున్నామన్నారు. భద్రత విషయంలో అనుమానాలున్నాయి... వైఎస్సార్సీపీ నేతలు పక్కి, తుళ్లిఎన్నికల కౌంటింగ్ వరకు భద్రతా ఏర్పాట్లపై పారదర్శకంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పక్కి దివాకర్, యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి తుళ్లి చంద్రశేఖర్ అన్నారు. ఈవీఎంలు ఉన్న బాక్స్‌లు ఆరు బయట ఉండడంపై ‘సాక్షి’లో వచ్చిన కథనంపై స్పందించిన జిల్లా ఎన్నికల అధికారులు పారదర్శకంగా వ్యవహరించాల్సింది పోయి.. అన్ని సర్దుకున్న తర్వాత సాయంత్రం రాజకీయపార్టీలు, మీడియా ప్రతినిధులను పిలి పించి పటిష్టమైన భద్రత కల్పిస్తున్నట్టుగా చూపిం చడం సరికాదన్నారు. అధికారుల తీరును సమర్ధించడం లేదని, ఖండిస్తున్నామని చెప్పుకొచ్చా రు. భద్రత విషయంలో తమకు కూడా పలు అనుమానాలున్నాయని చీఫ్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎన్నికల అధికారులు అనుమానాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరించా ల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఐ నగర కార్యదర్శి లోకనాథం అన్నారు. రౌండ్ ది క్లాక్ భద్రతను జిల్లా అధికారులు పర్యవేక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. -
ఈవీఎం.. ఆ..భయం!
న్నికల యజ్ఞం ముగిసింది. ప్రజాతీర్పు ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైంది. ఆ తీర్పు వెల్లడి కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఎన్నడూ లేనంత సుదీర్ఘంగా ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు జరుగుతుండటం.. మొత్తం ప్రక్రియ పూర్తి అయ్యాకే.. అంటే మే 23న ఓట్ల లెక్కింపునకు ముహూర్తం నిర్ణయం.. మొదటి దశలోనే రాష్ట్రంలో పోలింగ్ జరిగిపోవడం వంటి కారణాలతో ఏకంగా 43 రోజులపాటు ప్రజాతీర్పును తమలో దాచుకున్న ఈవీఎంలను కంటికి రెప్పలా కాపాడాల్సిన పరిస్థితి. అందుకు అనుగుణంగానే ఎన్నికల కమిషన్ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాండ్ రూములకు మెజిస్టీరియల్ అధికారాలుండే తహసీల్దార్ల నేతృత్వంలో రౌండ్ ది క్లాక్ భద్రత ఏర్పాటు చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఆ మేరకు దాదాపు అన్ని జిల్లాల్లో ప్రతి నియోజకవర్గానికి ముగ్గురు తహసీల్దార్ల పర్యవేక్షణలో భద్రత ఏర్పాటు చేశారు.కానీ విశాఖ జిల్లాలో మాత్రం ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తహసీల్దార్‌ను మాత్రమే నియమించారు. వారికి సహాయకులుగా ముగ్గురు చొప్పున డీటీలను ఇచ్చారు. వారు కూడా సక్రమంగా విధులు నిర్వర్తించడం లేదని సాక్షి పరిశీలనలో వెల్లడైంది. స్ట్రాంగ్ రూములున్న ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో పరిస్థితి చూస్తే.. నాలుగు గోడల మధ్య ఉండాల్సిన ఈవీఎంలు కొన్ని ఆరుబయట కనిపించాయి. భద్రతను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ అధికారులు గానీ.. కొన్ని నియోజకవర్గా స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతా సిబ్బంది జాడ గానీ కనిపించలేదు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్–కౌంటింగ్ మధ్య 43 రోజుల సుదీర్ఘ విరామం రావడంతో.. అంతవరకు స్ట్రాంగ్ రూముల్లో ఉండే ఈవీఎంల భద్రతకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలు విశాఖ జిల్లాలో సక్రమంగా అమలు కావడం లేదు. ఈవీఎంల భద్రతపై సాక్షి పరిశీలన జరిపినప్పుడు ఎన్నికల అధికారుల పర్యవేక్షన, భద్రత లోపాలు స్పష్టంగా కనిపించాయి. పోస్టల్, సర్వీస్ బ్యాలెట్ల జారీలోనే కాదు.. ఈవీఎంల భద్రత విషయంలోనూ జిల్లా యంత్రాంగం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్న విమర్శలు జోరందుకుంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భారీగా పోస్టల్ బ్యాలెట్లు జారీ చేశామని జిల్లా అధికారులు గొప్పలు చెప్పుకొంటున్నప్పటికీ.. నేటికీ సగం మందికి కూడా అందని పరిస్థితి నెలకొంది. పైగా పోస్టల్ బ్యాలెట్లు అందిన వారిలో చాలామందికి లోక్‌సభ తప్ప అసెంబ్లీ బ్యాలెట్లు పంపడం లేదన్న విమర్శలు పెద్ద ఎత్తున విన్పిస్తున్నాయి. ఈ తరుణంలో కొత్తగా ఈవీఎంల భద్రతలోని డొల్లతనం అధికారుల ఉదాసీనతను బయటపెడుతోంది. విశాఖలో మాత్రం డిప్యూటీ తహసీల్దార్లతో సరి విశాఖ జిల్లాలో మూడు లోక్‌సభ స్థానాలతో పాటు 15 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎంలను అత్యంత కట్టుదిట్టమైన భద్రత మ«ధ్య ఏయూ ఇంజినీరింగ్ కళాశాలకు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో తహసీల్దార్‌నే ఇన్చార్జిగా నియమించారు. వీరికి సహాయకులుగా ముగ్గురు చొప్పున డిప్యూటీ తహసీల్దార్ల(డీటీ)ను నియమించారు. దీంతో స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద విధి నిర్వహణను డీటీలకు అప్పగించి తహసీల్దార్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కనీసం రోజుకోసారైనా స్ట్రాంగ్ రూమ్‌లను పరిశీలిస్తున్నారా? అంటే.. లేదనే సమాధానం వస్తోంది. పోనీ డీటీలైనా స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద ఉంటున్నారా? అంటే అదీ లేదని ‘సాక్షి’ పరిశీలనలో స్పష్టమైంది. శనివారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల వద్ద పరిస్థితిని ‘సాక్షి’ బృందం పరిశీలించినప్పుడు రెవెన్యూ అధికారులు అటువైపు వెళ్లిన దాఖలాలు కన్పించలేదు. పర్యవేక్షణాధికారుల గురించి ఇంజినీరింగ్ కళాశాల సిబ్బందిని ఆరా తీస్తే.. రెవెన్యూ అధికారులు కాదు కదా.. కనీసం సిబ్బంది కూడా రావడం లేదని ప్రత్యేక బలగాలు, స్థానిక పోలీసులే 24 గంటలూ ఉంటున్నారని చెప్పుకొచ్చారు. పైగా కొన్ని నియోజకవర్గాల ఈవీఎంలు ఆరు బయటే పెట్టినట్టుగా కన్పిస్తోంది. వీటిని మరో 25 రోజుల పాటు ఈవీఎంలు కంటికిరెప్పలా కాపాడాల్సి ఉంది. భద్రత, పర్యవేక్షణ ఇలా ఉంటే.. ఎదైనా జరగరానిది జరిగితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ఈవీఎంల భద్రత, పర్య వేక్షణపై ప్రత్యేకదృష్టి సారించాలని ప్రధాన పార్టీల అభ్యర్థులు కోరుతున్నారు. స్ట్రాంగ్ రూముల భద్రతకు ఇవీ గైడ్‌లైన్స్ ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూముల వద్ద భద్రతకు ఎన్నికల కమిషన్ స్పష్టమైన గైడ్‌లైన్స్ జారీ చేసింది. 24 గంటలూ పర్యవేక్షించేలా మేజిస్టీరియల్ అధికారాలు ఉన్న తహసీల్దార్లను నియమించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తహసీల్దార్లు.. ఆ పైస్థాయి అధికారులకే భద్రత పర్యవేక్షణ బాధ్యత అప్పగించాలని స్పష్టంగా సూచిం చింది. కిందస్థాయి అధికారులెవరూ ఉండడానికి వీల్లేదని స్పష్టంగా పేర్కొంది. తహసీల్దార్ స్థాయి అధికారులైతేనే స్ట్రాంగ్ రూముల వద్ద ఎవరైనా అపరిచితులు సంచరించినా, ఏవైనా అనుకొని ఘటనలు జరిగినా.. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం వేచి చూడకుండా తమకున్న మేజిస్టీరియల్ అధికారాలతో అక్కడికక్కడే.. వెనువెంటనే తగిన చర్యలు చేపట్టే అవకాశముంటుందన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఈ గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలకు తూట్లు స్ట్రాంగ్ రూంల వద్ద భద్రతా సిబ్బందితో కలసి పర్యవేక్షించేందుకు మేజిస్ట్రేట్ హోదా కల్గిన తహసీల్దార్లను నియమించాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. కానీ మన జిల్లాలో మాత్రం డిప్యూటీ తహసీల్దార్లను నియమించారు. తహసీల్దార్లు స్ట్రాంగ్ రూంల పరిశీలనకు అసలు వెళ్లడం లేదు. డిప్యూటీ తహసీల్దార్లే పర్యవేక్షిస్తున్నారు. ఇది ఎన్నికల కమిషన్ ఆదేశాలకు తూట్లు పొడవడమే.– కాండ్రేగుల వెంకటరమణ, అధ్యక్షుడు జిల్లా వినియోగదారుల సంఘాల సమాఖ్య తహసీల్దార్లు, ఆర్వోలు పరిశీలిస్తున్నారు స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతను పర్యవేక్షించేందుకు గెజిటెడ్ హోదా కల్గిన డిప్యూటీ తహసీల్దార్లను నియమించడం వాస్తవమే. అయితే తహసీల్దార్లు, ఆర్వోలు రోజూ మూడు పూటలుగా వెళ్లి తమ నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలను పరిశీలిస్తున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే ఈ నియామకాలు జరిగాయి. భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడడం లేదు. రౌండ్ ది క్లాక్ భద్రతను పర్యవేక్షిస్తున్నాం. – ఆర్.గున్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి -
అవన్నీ పుకార్లే, నమ్మొద్దు: ద్వివేది
సాక్షి, అమరావతి: స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై ఎలాంటి సందేహాలు వద్దని, ఈవీఎంలను భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవీఎంలను భద్రపరిచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రతా వ్యవస్థ ఉంటుందన్నారు. రాజకీయా పార్టీలు, తమ ఏజెంట్లను స్ట్రాంగ్ రూమ్ సమీపంలోని కంట్రోల్ రూమ్‌లలో ఉంచవచ్చని తెలిపారు. అలాగే ఈవీఎంలను భద్రపరిచిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయం ఉండదన్నారు. అపోహలకు తావివ్వకుండా ఉండేలా భద్రత ఏర్పాటు చేస్తామన్నారు. చిత్తూరు జిల్లాలో స్ట్రాంగ్ రూమ్లపై వచ్చినవి పుకార్లు మాత్రమేనని ద్వివేది కొట్టిపారేశారు. స్ట్రాంగ్ రూమ్‌లలో ఈవీఎంలు సురక్షితంగా ఉన్నాయని, పుకార్లను ప్రచారం చేసేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని దివ్వేది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ద్వివేదిని కలిసిన మేరుగ నాగార్జున కాగా అంతకు ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ....సీఈవో గోపాలకృష్ణ ద్వివేదిని కలిశారు. వేమూరు నియోజకవర్గంలో అకృత్యాలు, దాడులపై చర్యలు తీసుకోకపోగా బాధితులపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. టీడీపీ రౌడీలపై పెట్టిన కేసుల్లో పురోగతి లేదని, పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని మేరుగ నాగార్జున తెలిపారు. బాధ్యులను వదిలేసి బాధితులను వేధిస్తున్నారని అన్నారు. దళితులపైనా, అండగా నిలిచిన ఇతర కులస్తులపైనా పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని సీఈవో దృష్టికి తీసుకువెళ్లారు. అనంతరం మేరుగ నాగార్జున మాట్లాడుతూ టీడీపీ నేతలు, పోలీసులు సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతున్నారన్నారు. ఎన్నికల కమిషన్నే సవాల్ చేస్తున్న టీడీపీ నేతలు గ్రామాల్లో నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్నికల ప్రక్రియతోపాటు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న చంద్రబాబు అండ్ కో పై ఎన్నికల కమిషన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులని చెప్పుచేతల్లో పెట్టుకుని టీడీపీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తోందన్నారు. వ్యవస్థను తన జేబు సంస్థగా మార్చుకున్న చంద్రబాబు పరిపాలన కొనసాగిస్తున్నారని మేరుగ నాగార్జున మండిపడ్డారు. -
కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ సమీక్ష
సాక్షి, అమరావతి : మే 23న జరిగే కౌంటింగ్ ఏర్పాట్లపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. సీఈవో గోపాలకృష్ణ ద్వివేది, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాధ, డీజీపీ ఆర్పీ ఠాకూర్లు సమీక్షకు హాజరయ్యారు. జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రతా ఏర్పాట్లు, కౌంటింగ్‌కు తీసుకోవాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. -
నేతల భవిత భద్రం!
మహబూబ్‌నగర్ క్రైం: పార్లమెంట్ ఎన్నికలు ముగిశాయి. ఓటర్లు తమ తీర్పు తెలపగా.. ఈవీఎంలలో నేతల భవిత భద్రంగా ఉంది. మహబూబ్‌నగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 12మంది అభ్యర్థులు బరిలో ఉండటం తెలిసిన విషయమే. ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలన్నింటినీ ఇప్పుడు జిల్లా కేంద్రంలోని జేపీఎన్సీఈ కళాశాల భవనాల్లో ఉంచారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల ఈవీంలు, వీవీప్యాట్లు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. ఇక అభ్యర్థుల భవితవ్యం స్ట్రాంగ్ రూముల్లో దాగి ఉంది. మే 23న ఓట్లను లెక్కించి ఫలితాలు వెల్లడిస్తారు. అంటే సరిగ్గా 38రోజుల సమయం ఉంది. ఇన్ని రోజులు అభ్యర్థులు ఓపిక పట్టక తస్పదు. ఇప్పుడు అందరి చూపు జేపీఎన్‌ఈఎస్ కళాశాల వైపే ఉంది. స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలు మహబూబ్‌నగర్, షాద్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర, మక్తల్, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా వచ్చిన ఈవీఎంలు, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచారు. భవనంలోని కింది అంతస్తులో మూడు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలు, పైన అంతస్తులో నాలుగు నియోజకవర్గాల స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. ఒక్కో నియోజకవర్గానికి ఒక స్ట్రాంగ్ రూం, ఒక ఓట్ల లెక్కింపు గదిని ఏర్పాటు చేశారు. అధికారులు, అభ్యర్థులు కూర్చునేందుకు, అలాగే మీడియా పాయింట్‌కు వేర్వేరు గదులను కేటాయించారు. నిఘా నేత్రాలతో పర్యవేక్షణ భవనం లోపల ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలో ఇతర విలువైన ఎన్నికల సామాగ్రి ఉన్నందున నిఘా కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రెండు అంతస్తుల్లోని స్ట్రాంగ్ రూంలు, గదులు తలుపులకు, హాళ్లలో, విధులు నిర్వహించే పోలీసుల గదుల వద్ద, భవనం, బయట కెమెరాలు బిగించారు. ఒక్కో నియోజకవర్గానికి కేటాయించిన గదులు, హాల్లో కనీసం కలిపి దాదాపు 30వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. భవనం బయట, లోపల అన్ని గదులు సీసీ కెమెరాల నిఘా నేత్రంలో నిక్షిప్తమవుతున్నాయి. బందోబస్తు నిర్వహించే పోలీసులు అప్రమత్తంగా ఉండేందుకు ఇవి దోహదపడటమే కాకుండా ఎలాంటి అనుమానాలకు తావులేకుండా పని చేస్తాయి. భవనం లోపల, పైన ఆరుబయట ప్రాంగణం మొత్తంలో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. పారామిలటరీ పోలీసుల ఆధీనంలో.. జేపీఎన్‌ఈఎస్ భవనాన్ని సీఆర్పీఎఫ్(సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్), పారామిలటరీ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 40మంది సీఆర్పీఎఫ్, 20మంది జిల్లా పోలీసులు నిత్యం ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు. భవనం లోపల పారామిలటరీ పోలీసులే ఉంటారు. సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ అనుమతి లేనిదే ఎవరినీ లోనికి పంపరు. జిల్లా లోకల్ పోలీసులను కూడా లోనికి అనుమతించారు. స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తు నిర్వహించే సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ తనిఖీ చేసి డ్యూటీ వేస్తారు. భవనం లోనికి వెళ్లే ప్రధాన ద్వారంతో పాటు పక్కన, వెనుక ఉన్న గేట్ల వద్ద బందోబస్తు పెట్టారు. ఉన్నతాధికారుల అనుమతితో పని నిమిత్తమై వచ్చే ఆర్వో, ఏఆర్వోలను అప్పుడప్పుడూ అధికారులకు లోపలికి వెళ్లడానికి మాత్రం అవకాశం కల్పిస్తారు. అలాగే భవనం చుట్టూ పోలీసులు పికెటింగ్‌లు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు. భవనం వద్ద బందోబస్తుపై లోకల్ పోలీసులకు జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరి సూచనలు చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని, ఎవరినీ ప్రాంగణంలోనికి రానివ్వద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. -
ఈవీఎం భద్రతలో బయటపడ్డ డొల్లతనం
-
ఈవీఎం విజువల్స్.. కలెక్టర్ ఆగ్రహం
కృష్ణా జిల్లా: మచిలీపట్నం నియోజకవర్గ పరిధిలోని ఓట్ల లెక్కింపు కేంద్రమైన కృష్ణా యూనివర్శిటీలో శనివారం అర్ధరాత్రి ఈవీఎంల తరలింపులో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై ఓ న్యూస్ చానల్లో ప్రచారం కావటంతో పాటు, ఓ దినపత్రికలో కూడా వార్త ప్రచురితమైంది. దీనిపై రాజకీయ పార్టీల నాయకులు, జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. సేకరించిన వివరాల ప్రకారం... నూజివీడు నియోజకవర్గానికి చెందిన పోలింగ్ ప్రక్రియకు ఉపయోగించిన ఈవీఎంలతో పాటు, రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను కూడా స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఉపయోగించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన అనంతరం రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను మచిలీపట్నంలోని మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదాముకు తరలించారు. ఈ సంఘటనపై న్యూస్ చానల్, దినపత్రికలో స్ట్రాంగ్ రూంలను తెరిచి ఈవీఎంలను తరలించినట్లు ప్రచురితమైంది. దీనిపై ఆదివారం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌తో పాటు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జిల్లా అధికారులు స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీల్లో ఈ వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అనంతరం కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ రిజర్వ్‌లో ఉన్న ఈవీఎంలను మాత్రమే స్ట్రాంగ్ రూంకు తరలించటం జరిగిందన్నారు. అది కూడా నూజివీడు నియోజకవర్గ రాజకీయ పార్టీ నాయకుల సమ్మతితోనే తరలించటం జరిగిందన్నారు. అయితే ఓ న్యూస్ చానల్లో ప్రసారం అయిన వీడియోను ఆ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వెంట ఉన్న వీడియో గ్రాఫర్ ద్వారా లీకైనట్లుగా భావిస్తున్నామన్నారు. ఈ విషయమై పూర్తిస్థాయిలో విచారణతో పాటు, సీసీ కెమోరాల పుటేజీలను కూడా సేకరించి సంబంధిత వ్యక్తిపై తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు. ఆ దృశ్యాలను సదరు మీడియా ఛానల్లో ప్రసారం కూడా చేశారు. -
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భద్రత పెంచండి
-
భద్రతా వలయంలోనే స్ట్రాంగ్ రూమ్‌లు
సాక్షి, అమరావతి: ఈవీఎంలు, వీవీ ప్యాట్లను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 68 స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. మొదటి అంచెలో కేంద్ర సాయుధ బలగాలు పహారా కాస్తాయని.. మిగిలిన ఆవరణను రాష్ట్ర పోలీసు బలగాలు పర్యవేక్షిస్తాయని తెలిపింది. స్ట్రాంగ్ రూమ్‌లకు ఉన్న అన్ని ప్రవేశ ద్వారాలకు సీల్ వేసినట్లు వెల్లడించింది. అలాగే అన్ని ద్వారాలను సీసీ కెమెరాల ద్వారా 24 గంటలూ పర్యవేక్షించేందుకు ప్రతి స్ట్రాంగ్ రూమ్ పక్కన ఒక సీనియర్ అధికారి, గెజిటెడ్ అధికారి నేతృత్వంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు వివరించింది. స్ట్రాంగ్ రూమ్‌లకు రెండంచెల లాకింగ్ వ్యవస్థ ఉంటుందని పేర్కొంది. ద్వితీయ భద్రతా వలయం దాటుకొని లోపలికి వచ్చే వారి పేర్లు, తేదీ, సమయం సీపీఎఫ్ లాగ్‌బుక్‌లో నమోదు చేస్తారని తెలిపింది. ఈ నిబంధన అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీసు సూపరింటెండెంట్లు, అభ్యర్థులు, వారి ఏజెంట్లకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఓట్ల లెక్కింపు రోజున స్ట్రాంగ్ రూమ్‌ను అభ్యర్థులు, వారి ప్రతినిధులు, రిటర్నింగ్ అధికారి, పరిశీలకుడి సమక్షంలో వీడియో చిత్రీకరణలో తెరుస్తారని వివరించింది. ఓట్ల లెక్కింపు కేంద్రానికి ఈవీఎంలను తీసుకెళ్లే వరకు వీడియో తీస్తారని పేర్కొంది. -
ఓవర్ టు స్ట్రాంగ్ రూమ్స్
సాక్షి, అమరావతి బ్యూరో/పెనమలూరు : పోలింగ్ ముగిసింది. మరో 41 రోజుల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. విజేతలెవరు? పరాజితులెందరు? ఓటరు ఆదరణ ఎవరికుంది? అన్నది స్పష్టం కానుంది. గురువారం పోలింగ్ ముగిసిన వెంటనే ఈవీఎంలు స్ట్రాంగ్‌రూమ్‌లకు తరలించారు. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్న ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను పెనమలూరు నియోజకవర్గంలోని ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపరిచారు. మచిలీపట్నం పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు.. అలాగే ఏలూరు పార్లమెంట్‌కు సంబంధించిన కైకలూరు, నూజివీడు నియోజకవర్గాల ఈవీఎంలను బందరులోని కృష్ణా యూనివర్సిటీకి తరలించారు. ఈ రెండు కేంద్రాల వద్ద ఈ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, మూడంచెల పోలీస్ భద్రత నడుమ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నెల రోజులుగా ఎన్నికల బందోబస్తులో కీలక విధులు నిర్వహించిన పోలీసులు పోలింగ్ పూర్తయిన తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. ఇక్కడితో వారి బాధ్యత తీరలేదు. ప్రస్తుతం బందోబస్తులో ఉన్న సిబ్బందిని పోలింగ్ కేంద్రాల నుంచి స్ట్రాంగ్ రూమ్‌లకు మార్చారు. వచ్చే నెల 23న ఉదయం జరిగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ వరకు వాటిని పర్యవేక్షిస్తూ.. బందోబస్తు కొనసాగించాల్సిందే. గంగూరులో డీసీపీ ఉదయరాణి ఈ బందోబస్తు పర్యవేక్షిస్తున్నారు. ఈవీఎంలు జాగ్రత్తగా స్ట్రాంగ్ రూమ్‌లలో ఉంచామని, మూడంచెల భద్రతా వ్యవస్థ ఉందని పోలీసు అధికారులు తెలిపారు.అనుమతి లేనివారు కాలేజీ లోనికి అనుమతించమని అధికారులు తెలిపారు. జిల్లాలో 35,51838 మంది ఓటర్లు ఉండగా.. 81.10 శాతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. 205 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన మచిలీపట్నంసబర్బన్/కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నం మండలం రుద్రవరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంను జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్‌తో కలిసి జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ట్రతిపాఠి శుక్రవారం సందర్శించారు. ఈవీఎంలు భద్రపరిచిన గదులను పరిశీలించారు. కలెక్టర్‌కు ఎస్పీ త్రిపాఠి స్ట్రాంగ్‌రూంల వద్ద పోలీసు బందోబస్తుకు సంబంధించిన విషయాలను వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల ముగిసిన నేపథ్యంలో జిల్లాలోని ఈవీఎంలను, వీవీప్యాడ్‌లను పటిష్ట బందోబస్తు నడుమ భద్రపరిచామన్నారు. కృష్ణా యూనివర్సిటీ, గంగూరులోని ధనేకుల ఇంజినీరింగ్ కళాశాలలో భద్రపర్చిన ఈవీఎంల స్ట్రాంగ్ రూంలకు పలు పార్టీలకు సంబంధించిన నాయకుల సమక్షంలో కలెక్టర్ సీల్ వేశారు. అనంతరం ఎస్పీ యూనివర్సిటీ వద్ద కేంద్ర సాయుధ బలగాలు, రాష్ట్ర సాయుధ బలగాలతో అవసరమైన భద్రతా ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. స్ట్రాంగ్ రూంలతో పాటు యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని సిబ్బందికి సూచించారు. అపరిచిత వ్యక్తులు వర్సిటీ చుట్టుపక్కల తారసపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వర్సిటీ పరిసర ప్రాంతాల్లో జరిగే ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలిస్తుండాలని సిబ్బందికి సూచించారు. అనంతరం ఆయన జిల్లా అడిషనల్ ఎస్పీ సోమంచి సాయికృష్ణ, బందరు డీఎస్పీ మహబూబ్‌బాషాలతో స్ట్రాంగ్‌రూం బందోబస్తుపై పలు సూచనలు జారీ చేశారు. ఎన్నికల అబ్జర్వర్లు అక్తర్‌అన్సారీ, బినోదానంద్, రాకేష్‌కుమార్‌పాండే ఉన్నారు. -
స్ట్రాంగ్ రూంలకు పటిష్ట భద్రత
నర్సాపూర్: ఈవీఎంలు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ధర్మారెడ్డి తెలిపారు. నర్సాపూర్‌లోని స్ట్రాంగ్ రూంలలో ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపరిచి.. గదులకు సీలు వేసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లను నర్సాపూర్‌లోని బీవీరాజు ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసి స్ట్రాంగ్ రూంలలో భద్రపర్చినట్లు చెప్పారు. నర్సాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్‌కు చెందిన ఈవీఎంలను పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూంలో భద్రపరిచామన్నారు. సంగారెడ్డి, పటాన్చెరు అసెంబ్లీ సెగ్మెంట్లకు చెందిన ఈవీఎంలు, వీవీప్యాట్లను పట్టణంలోని అల్లూరి సీతరామరాజు గిరిజన గురుకుల విద్యాలయంలోని స్ట్రాంగ్ రూంలలో నిక్షిప్తం చేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూంల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్యారా మిలిటరీ బలగాలతో గట్టి భద్రత కల్పించినట్లు పేర్కొన్నారు. ఒక్కో స్ట్రాంగ్ రూం వద్ద ఒక సెక్షన్ ప్యారామిలిటరీ బలగాలు భద్రతగా ఉంటాయని, ఆయుధాలు కలిగిన ఇద్దరు జవాన్లు నిరంతరం పహారా కాస్తారని కలెక్టర్ వెల్లడించారు. స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన భవనాల బయట స్థానిక పోలీసులు ఉంటారన్నారు. ఎన్నికల అబ్జర్వర్ సంజయ్‌మీనా పర్యవేక్షణలో ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు సూచించిన ఆయా పార్టీల ప్రతినిధుల సమక్షంలో స్ట్రాంగ్ రూంలకు సీలు వేసినట్లు చెప్పారు. ఆయా పార్టీల అభ్యర్థులు సూచించిన ప్రతినిధులు స్ట్రాంగ్ రూంలను చూడాలని భావిస్తే స్ట్రాంగ్ రూంలు ఉన్న భవనంలోని ఒక గదిలో సీసీ కెమెరాల మానిటర్ ఏర్పాటు చేశామని, మానిటర్లో భద్రత చర్యలను చూసుకునే వీలుంటుందన్నారు. దగ్గరుండి సీలు వేయించిన కలెక్టర్, అబ్జర్వర్.. ఈవీఎంలు, వీవీప్యాట్లు భద్రపర్చిన స్ట్రాంగ్ రూంలకు ఎన్నికల అబ్జర్వర్ సంజయ్‌మీనా, కలెక్టర్ ధర్మారెడ్డి దగ్గరుండి పార్టీల ప్రతినిధుల సమక్షంలో సీలు వేయించారు. సీలు వేసే సమయంలో కలెక్టర్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. గురుకుల విద్యా సంస్థలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూం వద్ద కరెంటు వైర్లను సరి చేయించాలని సూచించారు. ఎస్పీ చందనా దీప్తి స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత, ఇతర అంశాలపై కలెక్టర్ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి ఎన్నికల అబ్జర్వర్ సంజయ్మీనాతో చర్చించారు. ఇదిలాఉండగా స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేసిన భవనాల వద్ద ముందస్తు జాగ్రత్తగా ఒక్కో ఫైరింజన్‌ను అందుబాటులో ఉంచారు. పార్టీ ప్రతినిధులకు పత్రాలు అందజేత.. మెదక్ లోక్‌సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన పోలింగ్ స్టేషన్ల వివరాలు, వినియోగించిన ఈవీఎంల వివరాలు, పోలైన ఓట్ల వివరాలతో కూడిన పత్రాలను అధికారులు శుక్రవారం పోటీలో ఉన్న అభ్యర్థులు సూచించిన ఆయా పార్టీల ప్రతినిధులకు అందజేశారు. స్ట్రాంగ్ రూంలకు సీలు వేసే సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి నియమించిన ప్రతినిధులు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ నియమించిన ఆ పార్టీ ప్రతినిధులు ఆంజనేయులుగౌడ్, మల్లేష్ ఉన్నారు. -
ధీమా అందరిది.. విజయం ఎవరిదో!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ స్థానంలో గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. ఒక పక్క మునుపెన్నడూ లేని విధంగా తగ్గిన పోలింగ్ శాతం దడ పుట్టిస్తున్నా.. గెలుపుపై అందరూ నమ్మకం పెట్టుకున్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్‌లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు చాలా మంది పోలింగ్‌కు దూరంగా ఉన్నారు. కనీసం 50 శాతం మార్క్‌ను కూడా అధిగమించలేదు. గ్రామీణ ఓటర్లలో మాత్రం చైతన్యం వెల్లివిరిసింది. గత లోక్‌సభ ఎన్నికలతో పోల్చితే పోలింగ్ శాతం తగ్గినప్పటికీ పట్టణ ప్రాంతాల కంటే ఎక్కువగానే నమోదైంది. రెండింటి మధ్యే.. చేవెళ్ల స్థానానికి టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య నువ్వా నేనా అన్నట్లు పోటీ జరిగినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది. ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని నియోజకవర్గాలు టీఆర్ఎస్కు సానుకూలంగా ఉండగా.. ఇంకొన్ని కాంగ్రెస్‌కు అండగా నిలిచినట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి అవగతమవుతోంది. ఒకటి రెండు సెగ్మెంట్లలో బీజీపీ కూడా అధిక ఓట్లను తన ఖాతాలో వేసుకున్నట్లు అంచనా. ఈ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో చూస్తే చేవెళ్లలో అత్యధికంగా పోలింగ్ నమోదైంది. 71.05 శాతం పోలైన ఓట్లలో కాంగ్రెస్‌ది పైచేయి ఉన్నట్లు తెలుస్తోంది. రైతులు, నిరుద్యోగ ఓటర్లను కాంగ్రెస్ బాగా ఆకర్షించినట్లు రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. పూర్తిగా పట్టణ ప్రాంతమైన శేరిలింగంపల్లిలో పోలింగ్ శాతం గణనీయంగా పడిపోయింది. ఇక్కడ 41.80 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడి ఓటర్లలో అత్యధికులు సెటిలర్లే. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో వీరు టీఆర్ఎస్ వైపు ఉన్నట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఈ వలస ఓటర్లందరూ ఓటేసేందుకు తమ సొంత ప్రాంతమైన ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. ఇక మిగిలిన వారిలో అత్యధికులు స్థానికులు. వీరిలో అధిక ఓటర్లు కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు అంచనా. రాజేంద్రనగర్ సెగ్మెంట్లోనూ కాంగ్రెస్, టీఆర్ఎస్ నువ్వా నేనా అన్న రీతిలో పోరు నడిచినట్లు తెలుస్తోంది. ఇక్కడి సెటిలర్లలో చాలామంది తమ సొంత స్థలాలకు వెళ్లారు. ఇందులో దాదాపు టీఆర్ఎస్ సానుకూల ఓటర్లే ఎక్కువగా ఉంటారని రాజకీయ విశ్లేషకుల భావన. దీంతో టీఆర్ఎస్కు కొంతమేర గండి పడినట్లు తెలుస్తోంది. ఈ లోటును ముస్లిం ఓటర్లు భర్తీ చేసినట్లు వెల్లడవుతోంది. బహిరంగంగానే ఎంఐఎం.. టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడం వల్ల వారి ఓట్లన్నీ కారు గుర్తు వైపు మళ్లినట్లు కనిపిస్తోంది. సగం పట్టణ, మిగిలిన సగభాగం గ్రామీణంగా ఉన్న మహేశ్వరంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడినట్లు స్పష్టమవుతోంది. పట్టణ ప్రాంతవాసులు బీజీపీ పట్ల మొగ్గుచూపినట్లు ఆయా వర్గాలను బట్టి తెలుస్తోంది. పైగా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి చెప్పుకోదగ్గ రీతిలో ఓట్లు దక్కడం, తాజాగా లోక్‌సభ ఎన్నికలకు రెండురోజుల ముందు ఆ పార్టీ చీఫ్ అమిత్‌షా సభ కొంత ప్రభావం పడినట్లు కనబడుతోంది. ఇక పల్లె ప్రాంతాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అనే రీతిలో ఓట్లను రాబట్టుకున్నట్లు వెల్లడవుతున్నాయి. వికారాబాద్‌లో కారు, హస్తం మధ్యం రసవత్తర పోరు నడిచినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే వెంట నడిచేందుకు మొగ్గుచూపని నేతలు ప్రచారానికి పెద్దగా ఆసక్తి చూపనట్లు చర్చ జరుగుతోంది. దీని కారణంగా ఓట్లు హస్తం వైపు మళ్లినట్లు తెలుస్తోంది. పరిగి నియోజకవర్గంలో కారు జోరు కొనసాగినట్లు స్పష్టంగా తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే ప్రతిష్టాత్మకంగా తీసుకుని సెగ్మెంట్‌పై పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించి విస్తృత ప్రచారం చేసినట్లు క్షేత్రస్థాయి పరిస్థితిని బట్టి అర్థమవుతోంది. ఫలితంగా అధిక శాతం ఓటర్లు కారు వైపు ఉన్నట్లు వెల్లడవుతోంది. ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్‌కు ఓట్లు దక్కినట్లు తెలుస్తోంది. తాండూరులో కాంగ్రెస్ గాలి వీచినట్లు వెల్లడవుతోంది. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. పైగా కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి అత్యంత విశ్వాసపాత్రుడు కావడంతో కొండా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా హస్తానికి అధిక ఓట్లు పడినట్లు స్పష్టమవుతోంది. గ్రామీణంలో ‘స్థానికత’ అస్త్రం చేవెళ్ల, వికారాబాద్, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల స్థానికత అంశం బాగా పనిచేసినట్లు ఆయా వర్గాల ఓటర్లు చెబుతున్నారు. స్థానిక అభ్యర్థి అయితే తమకు అందుబాటులో ఉంటారని వారు భావించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక అభ్యర్థి అంశం.. ఓట్లు సాధించేందుకు కొంత అస్త్రంగా పనిచేసి ఉండొచ్చని అంచనా. ఇదే జరిగితే కాంగ్రెస్ అభ్యర్థికి కలిసిరావొచ్చు. -
భవితవ్యం భద్రం
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. లోక్‌సభ పరిధిలో 11,37,231 మంది ఓట్లు వేయగా.. బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరి అంచనాల్లో వారు నిమగ్నమయ్యారు. గురువారం సాయంత్రం 5 గంటల వరకు 67.9 శాతం ఓటింగ్ జరిగినట్లు తొలుత అధికారులు ప్రకటించగా.. 5గంటల తర్వాత కూడా అనేక మంది ఓటర్లు క్యూలో నిల్చోవడం.. వారంతా ఓటు హక్కు వినియోగించుకోవడంతో ఓటింగ్ శాతం 75.16కు చేరింది. పోలింగ్ సరళినిబట్టి ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఏయే పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయి.. తమకెన్ని ఓట్లు వస్తాయని లెక్కలేసుకుంటున్నారు. ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. వాటి పరిధిలో 15,13,094 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుషులు 7,39,600 మంది, 7,73,428 మంది మహిళలు, 66 మంది ఇతరులు ఉన్నారు. వీరిలో 11,37,231 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వారిలో 5,59,387 మంది పురుషులు, 5,77,812 మంది మహిళలు, 32 మంది ఇతరులు ఉన్నారు. దీంతో మొత్తం పోలింగ్ 75.16 శాతం జరిగినట్లు అధికారులు శుక్రవారం ప్రకటించారు. ఉదయం సమయంలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో మొదట పోలింగ్ మందకొడిగా ప్రారంభమైంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో మధ్యాహ్నం వరకు ఓటర్లు చాలా తక్కువ మంది పోలింగ్ బూత్‌లకు వచ్చారు. అయితే ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం తర్వాత ఓటర్లు బూత్‌ల వద్దకు చేరుకున్నారు. దీంతో పోలింగ్ సమయం దాటిన తర్వాత కూడా ఓటు వేసేందుకు వచ్చిన వారు మిగిలిపోవడంతో అప్పటి వరకు క్యూలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. ఈవీఎంలలోనే.. ఖమ్మం లోక్‌సభ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఈవీఎంలు, వీవీ ప్యాట్లను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. ఇక్కడ మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మొదటి దశలో కేంద్ర బలగాలు, రెండో దశలో రాష్ట్రస్థాయి బలగాలు, మూడో దశలో జిల్లాస్థాయి బలగాలతో భద్రతను ఏర్పాటు చేశారు. మే 23వ తేదీ వరకు స్ట్రాంగ్‌రూమ్‌లలో అభ్యర్థుల భవిష్యత్ నిక్షిప్తమై ఉంటుంది. అప్పటి వరకు అభ్యర్థుల తరఫున కూడా బందోబస్తు నిర్వహించే అవకాశం కూడా కల్పించారు. ఈసారి ఎన్నికల నిర్వహణకు, ఫలితాల ప్రకటనకు దాదాపు 40 రోజుల గడువు ఉంది. అంచనాల్లో పార్టీలు.. ఎన్నికలు ముగియడంతో వివిధ పార్టీల నాయకులు, అభ్యర్థులు అంచనాల్లో మునిగిపోయారు. పోలింగ్ సరళి ఎలా నమోదైంది.. తమ పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఎక్కడ ఉంటుంది.. ఎక్కడ ఓట్లు పడలేదనే దానిపై లెక్కలు వేయడంలో అభ్యర్థులు లీనమయ్యారు. ఫలితాల వెల్లడికి ఎక్కువ రోజులు గడువు ఉండడంతో అభ్యర్థుల్లో ఉత్కంఠతో కూడిన ఆందోళన నెలకొంది. అయితే విజయం ఎవరిని వరిస్తుందనే దానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఎం, బీజేపీలతోపాటు సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, జనసేన అభ్యర్థులు పోలింగ్ సరళినిబట్టి తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉందనే దానిపై అంచనాలకు వస్తున్నారు. పాలేరులో అత్యధికంగా పోలింగ్.. ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో మొత్తం 75.16 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాలేరు నియోజకవర్గంలో అత్యధికంగా 82.87 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,16,622 మంది ఓటర్లు ఉండగా.. 1,79,518 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ తర్వాత మధిర నియోజకవర్గంలో 81.40 శాతం పోలింగ్ నమోదైంది. ఇక్కడ 2,10,358 మంది ఓటర్లు ఉండగా.. 1,71,232 మంది ఓటు వేశారు. వైరాలో 79.15 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 1,83,286 మంది ఓటర్లు ఉండగా.. 1,45,077 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. సత్తుపల్లిలో 77.84 శాతం ఓటింగ్ జరిగింది. ఇక్కడ మొత్తం 2,30,426 మంది ఓటర్లు ఉండగా.. 1,79,353 మంది ఓటు వేశారు. అశ్వారావుపేటలో 77.72 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 1,50,205 మంది ఓటర్లు ఉండగా.. 1,16,735 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో 66.77 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,28,597 మంది ఓటర్లు ఉండగా.. 1,52,641 మంది ఓటర్లు ఓటు వేశారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 65.63 శాతం పోలింగ్ జరిగింది. ఇక్కడ 2,93,600 మంది ఓటర్లు ఉండగా.. 1,92,675 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా.. పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో ఈవీఎంలను తనికెళ్లలోని విజయ ఇంజనీరింగ్ కళాశాలలో గల స్ట్రాంగ్‌రూమ్‌లో భద్రపరిచారు. భద్రపరిచిన ఈవీఎంలను కలెక్టర్ ఆర్వీ.కర్ణన్ శుక్రవారం పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ను దగ్గరుండి సీల్ చేయించారు. అలాగే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు కూడా సందర్శించారు. స్ట్రాంగ్‌రూమ్‌కు సీల్ వేస్తున్న దృశ్యం -
స్ట్రాంగ్ రూమ్‌లకు చేరిన ఈవీఎమ్‌లు
-
ఓవర్ టు స్ట్రాంగ్ రూమ్స్!
సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల్లో తుది ఘట్టమైన కౌంటింగ్‌కు మూడు రోజుల గడువు ఉండటంతో పోలీసు బందోబస్తు డ్యూటీ స్ట్రాంగ్ రూమ్స్ వద్దకు మారింది. ఈవీఎం మిషన్లను శుక్రవారం రాత్రికి వీటికి తీసుకువచ్చి భద్రపరిచారు. నగర పరిధిలోని తొమ్మిది ప్రాంతాల్లోని 15 చోట్ల స్ట్రాంగ్ రూమ్స్/కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి. మంగళవారం కౌంటింగ్ సైతం ఇక్కడే జరుగనుంది. పోలింగ్ నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకున్న పోలీసులు స్ట్రాంగ్‌రూమ్స్ వద్దా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా మూడంచెల భద్రత కల్పించడంతో పాటు కొన్ని అదనపు చర్యలు తీసుకుంటున్నారు. ఈవీఎంల భద్రతా ఏర్పాట్లిలా... స్ట్రాంగ్ రూమ్‌లకు కేవలం ఒకే ద్వారం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. రూమ్‌కు డబుల్ లాక్ సిస్టం ఏర్పాటు చేసి ఒకటి దాని ఇన్చార్జ్ వద్ద, మరోటి మెజిస్టీరియల్ అధికారాలున్న అధికారి వద్ద ఉంచారు. ♦ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద 24 గంటలూ సాయుధ గార్డులను ఉంచడంతో పాటు అనునిత్యం సీసీ కెమెరాల ద్వారా నిఘా ఏర్పాటు చేశారు. వీటి పక్కనే నిర్విరామంగా పని చేసే కంట్రోల్ రూమ్ నెలకొల్పి ఇందులో పోలీసులతో పాటు రెవెన్యూ అధికారినీ ఉంచారు. పవర్ కట్ లేకుండా చూస్తూనే... అదనంగా జనరేటర్ ఏర్పాటు చేశారు. ♦ మూడంచెల భద్రతలో భాగంగా తొలి అంచెలో (రూమ్ డోర్ దగ్గర) కేంద్ర సాయుధ బలగాలకు చెందిన వారు ఉంటున్నారు. దీనికోసం కనీసం ఒక సెక్షన్ (13 మంది) బలగాలు 24 గంటలూ అందుబాటులో ఉండేందుకు ఓ ప్లటూన్ (39 మంది) ప్రత్యేకంగా కేటాయించారు. ♦ రెండో అంచెలో రాష్ట్ర సాయుధ పోలీసులు, మూడో అంచెలో సాధారణ పోలీసు సాయుధ బలగాలను మోహరించారు. ♦ స్ట్రాంగ్‌రూమ్స్ ప్రాంగణంలోనే రూమ్ ప్రవేశ ద్వారం కనిపించేలా ఏర్పాటు చేసిన టెంట్స్‌లో అభ్యర్థుల ప్రతినిధులకు సౌకర్యం కల్పించారు. ఇలా అవకాశం లేని చోట సీసీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ ప్రవేశ ద్వారాన్ని టెంట్లో ఉండి చూసేలా, అప్పుడప్పుడు రూమ్స్ సమీపంలోకి స్వయంగా వెళ్లి పర్యవేక్షించే అవకాశం కల్పిస్తున్నారు. ♦ స్ట్రాంగ్‌రూమ్ ఉన్న ప్రాంగణం మొత్తాన్ని భద్ర తా వలయంగా పరిగణిస్తున్న పోలీసు అధికారులు అందులోకి పోలీసు ఉన్నతాధికారుల సహా ఎవరి వాహనాలను అనుమతించట్లేదు. ♦ రెండో అంచె భద్రతా వలయాన్ని దాటి ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూమ్స్ సమీపంలోని వెళ్లే ప్రతి ఒక్కరి వివరాలు కచ్చితంగా కేంద్ర సాయుధ బలగాల వద్ద లాగ్‌బుక్‌లో ఎంట్రీ చేసుకుంటున్నారు. ఈ ప్రక్రియనూ వీడియోగ్రఫీ చేస్తున్నారు. ♦ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు స్థానిక పోలీసు ఉన్నతాధికారులతో కలిసి ప్రతి రోజూ స్ట్రాంగ్రూమ్స్ను పరిశీలించి ప్రధాన ఎన్నికల అధికారికి నివేదిక ఇచ్చేలా ఏర్పాటు చేశారు. ఈ అధికారులతో పాటు పోలీసు ఉన్నతాధికారులూ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించనున్నారు. ♦ స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (సీసీసీ)కి అనుసంధానించారు. అక్కడి దృశ్యాలను ఎప్పటికప్పుడు ఇక్కడి సిబ్బంది పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు. నియోజకవర్గం స్ట్రాంగ్‌రూమ్/కౌంటింగ్ కేంద్రం ముషీరాబాద్ ఎల్బీ స్టేడియం బ్యాడ్మింటన్ హాల్ మలక్‌పేట అంబర్‌పేట ఇండోర్ స్టేడియం సనత్‌నగర్ ఎంబీఏ కామర్స్ బిల్డింగ్, ఓయూ సికింద్రాబాద్ పీజీఆర్ఆర్ సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓయూ కార్వాన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్, మాసబ్‌ట్యాంక్ యాకత్‌పుర వనిత మహా విద్యాలయ, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ చార్మినార్ కమల నెహ్రూ పాలిటెక్నిక్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ ఖైరతాబాద్ కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, నార్త్ వింగ్, యూసుఫ్‌గూడ జూబ్లీహిల్స్ కేవీబీఆర్ ఇండోర్ స్టేడియం, సౌత్ వింగ్, యూసుఫ్‌గూడ చంద్రాయణగుట్ట లైబ్రరీ హాల్, నిజాం కాలేజ్ నాంపల్లి బాక్సింగ్ హాల్, ఎల్బీ స్టేడియం అంబర్‌పేట రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వైఎంసీఏ బహదూర్‌పుర సాంకేతిక విద్యాభవన్, మాసబ్‌ట్యాంక్ గోషామహల్ కోఠి ఉమెన్స్ కాలేజ్ ఆడిటోరియం కంటోన్మెంట్ వెస్లీ కాలేజ్, సికింద్రాబాద్ -
బ్యాలెట్ పత్రాలు స్ట్రాంగ్ రూమ్‌లో భద్రం
అనంతపురం అర్బన్ : పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్ర, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ గురువారం ముగిసింది. బ్యాలెట్ పత్రాలను అనంతపురంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. గురువారం అనంతపురం జిల్లాకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలోకి చేర్చారు. వైఎసార్ జిల్లా, కర్నూలు జిల్లాకు సంబంధించిన బ్యాలెట్ బాక్సులు శుక్రవారం రానున్నాయి. స్ట్రాంగ్ రూమ్ వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద జాగ్రత్త సుమీ!
భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : నరసాపురం పార్లమెంట్, దీని పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఈవీఎంలను భద్రపరచిన స్ట్రాంగ్‌రూంల వద్ద భద్రత సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని నరసాపురం పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జేసీ టి.బాబూరావునాయుడు ఆదేశించారు. భీమవరం విష్ణు ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్‌రూంలను ఆయన శనివారం పరిశీలించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల పటిష్టత, భవనాలకు లీకేజీలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. 16న కౌంటింగ్ జరిగే వరకు బీఎస్ఎఫ్ సిబ్బంది మూడు అంచెల విధానం ద్వారా విధులు నిర్వహించాలన్నారు. కేంద్ర బలగాలకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఫోన్ నెంబర్లను అందజేయాలని, ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఫోన్ చేసేలా వారికి మార్గదర్శకాలు చేయాలని ఆర్వోలను ఆదేశించారు. ప్రతి స్ట్రాంగ్ రూమ్‌ను సందర్శించే రిటర్నింగ్ అధికారులు రిజిస్టర్లో సంతకాలు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూంల వద్ద ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని, అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్వోలు, తహసిల్దార్, ఇతర అధికారులు ఉన్నారు. ఓట్ల లెక్కింపు బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలి పాలకొల్లు అర్బన్ : పార్లమెంట్, అసెంబ్లీ ఓట్ల లెక్కింపు పరిశీలకులు సమర్థవంతంగా విధులు నిర్వహించి, ఏ విధమైన విమర్శలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.బాబూరావునాయుడు సూచించారు. శనివారం స్థానిక ఏఎంసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన ఓట్ల లెక్కింపు పరిశీలకుల శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని పలు సూచనలు చేశారు. ఈవీఎంలో మొత్తం ఓట్ల లెక్కింపు బటన్ ఒకసారి సరి చూసుకోవాలన్నారు. ఈవీఎం బ్యాటరీ మోడ్‌లోకి వెళితే చేసేదేమీలేదని, తిరిగి రీపోలింగ్ జరిపించాల్సిందేనన్నారు. అలాగే పోలింగ్ సమయంలో ఒకటికి బదులుగా రెండో మిషన్ వినియోగించినట్లయితే దానికి గల కారణాలు తెలుసుకోవాలన్నారు. లెక్కింపు ఏజెంట్లతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, వాదోపవాదాలకు తావివ్వకూడదన్నారు. మిషన్ ఆన్ అయ్యే సమయంలో కొంత సమయం తీసుకుంటుందని ఈ విషయంలో పరిశీలకులు ఆందోళన చెంది, ఏజెంట్లను అయోమయానికి గురిచేయవద్దన్నారు. ఏ సమస్య తలెత్తినా ఆర్వో, లేదా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. శిక్షణ తరగతుల్లో ఆర్వో ఆర్.సూర్యనారాయణ, తహసిల్దార్ వి.స్వామినాయుడు, ఎంఈవో ఆర్ఎన్వీఎస్ గంగాధరశర్మ, రిసోర్సుపర్సన్లు దంగేటి గోపాలకృష్ణ, పి.లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.