
'శారద'పై సీబీఐ విచారణకు సుప్రీం ఆదేశం
తీవ్ర సంచలనం సృష్టించిన శారద చిట్ఫండ్ స్కామ్పై సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. నగదు మదుపుదారులలో విశ్వాసం కలిగించేందుకే సీబీఐ విచారణకు ఆదేశించినట్లు ఆ ఆదేశాలలో పేర్కొంది. జస్టిస్ టీఎస్ ఠాకూర్తో కూడిన ధర్మాసనం ఈ మేరకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఒడిశాలో సంచలనం కలిగించిన పొంజి స్కాంపై కూడా విచారణ జరపాలని ఆదేశించింది.
ఆ రెండు స్కాంలకు సంబంధం ఉండవచ్చని సుప్రీం ఈ సందర్బంగా అభిప్రాయపడింది. శారద చిట్ఫండ్ స్కాం మూలలు పశ్చిమబెంగాల్, ఒడిశాతోపాటు అసోం రాష్ట్రాలకు విస్తరించి ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది. అయితే శారద స్కాంపై సుప్రీం కోర్టు ఆదేశాలను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యతిరేకించారు.