వ్యాపమ్ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశం | vyapam case trasferred to the cbi probe by supreme court | Sakshi
Sakshi News home page

వ్యాపమ్ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశం

Published Thu, Jul 9 2015 12:34 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

వ్యాపమ్ స్కాంపై  సీబీఐ విచారణకు ఆదేశం - Sakshi

వ్యాపమ్ స్కాంపై సీబీఐ విచారణకు ఆదేశం

దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్న వ్యాపమ్ కుంభకోణంపై  సుప్రీంకోర్టు సీరియస్గా స్పందించింది. వరుస అనుమానాస్పద మరణాలతో కిల్లింగ్ స్కాం పేరుగాంచిన ఈ కుంభకోణం కేసును ఉన్నత న్యాయస్థానం  సీబీఐ అప్పగిస్తూ గురువారం ఆదేశాలు జారీ చేసింది.  ఈ సందర్భంగా కేంద్రానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, గవర్నర్ రామ్ నరేష్ యాదవ్కు నోటీసులు జారీ చేసింది.

దీనిపై నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతోపాటూ సీబీఐ దర్యాప్తును తాము పర్యవేక్షిస్తామని సుప్రీం తెలిపింది. గవర్నర్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని సర్వోన్నత న్యాయస్థానం  ప్రశ్నించింది.   సీబీఐ విచారణకు ఆదేశించాలా లేదా అనేది తేల్చకుండా తాత్సారం చేసిందని మండిపడింది. ఈ విషయం హైకోర్టు  చేతిలో ఉందంటూ ప్రభుత్వం చేతులు దులుపుకుందని వ్యాఖ్యానించింది.   తదుపరి విచారణకు ఈ నెల 24కు వాయిదా వేసింది. కాగా ఈ  కుంభకోణంపై దాదాపు తొమ్మిది పిటిషన్లు దాఖలుకాగా  పిటిషనర్ల తరపున  కపిల్  సిబల్ వాదనలు వినిపించారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement