సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ ఉదంతంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లీకేజీ ద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దీనిలో ప్రమేయమున్న పెద్ద చేపలను పట్టుకోవాలని వారు గురువారం ఒక ప్రకటనలో సీఎంని కోరారు.