krishnayya
-
జయహో బీసీ మహాసభపై వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమావేశం
-
తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో ఆరుగురు అరెస్ట్
-
50 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి
సాక్షి, ముషీరాబాద్(హైదరాబాద్): ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 50 వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యానగర్‌లోని బీసీ భవన్లో బుధవారం బీసీ సంఘం నేత గుజ్జ కృష్ణ అధ్యక్షతన జరిగిన బీఈడీ, డీఈడీ, పీఈటీ పూర్తి చేసిన నిరుద్యోగ అభ్యర్థుల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్న మాదిరిగానే టీచర్ పోస్టులను భర్తీకి కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీలో నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలను తీ ర్చిదిద్ది పేద, బడుగు, బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను అందంగా తీర్చిదిద్దుతున్నారని, వేలకోట్లను వెచ్చిస్తున్నా రని తెలిపారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల ముందు నో వేకెన్సీ బోర్డులు దర్శనం ఇస్తున్నాయన్నారు. అదే పరిస్థితి తెలంగాణలో కూడా తీసుకురావాలని విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో లాల్‌కృష్ణ, లక్ష్మణ్‌యాదవ్, అంజి, సత్యనారాయణ, అనంతయ్య, సతీశ్, చంటి ముదిరాజ్, సుచిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. చదవండి: దళితబంధును వదులుకున్న సిసలైన శ్రీమంతులు.. -
పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం చలో ఢిల్లీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ విభాగాల్లోని బీసీ ఉద్యోగులకు పదోన్నతు ల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరమని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సవరణ చేయాలని కోరింది. ఇందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు నవంబర్‌లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి బీసీ వర్గాల్లో చైతన్యం తీసుకొస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ భవన్లో సోమవారం జరిగిన బీసీ ఉద్యోగుల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలన్నారు. -
చంద్రబాబు తీరు గర్హనీయం: కృష్ణయ్య
గన్ ఫౌండ్రీ: ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్–2 సర్వీస్ ఉద్యోగాల పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని, గ్రూప్–2 పోస్టులను 3 వేలకు పెంచాలని కోరుతూ శుక్రవారం ఏపీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీలం వెంకటేష్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఏపీపీఎస్సీ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ... ఏపీలో 1.95 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం ఉపాధ్యాయ ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం అన్యాయమని అన్నారు. ధర్నా అనంతరం ఏపీపీఎస్సీ చైర్మన్ ఉదయ్ భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, విద్యార్ధి సంఘం అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, రాంబాబు పాల్గొన్నారు. -
పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలి
సుల్తాన్ బజార్: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య అన్నారు. మంగళవారం కోఠిలోని డిఎంహెచ్‌ఎస్ క్యాంపస్‌లో వైద్య ఆరోగ్య శాఖ బీసీ ఉద్యోగుల మహాగర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని ప్రధాని మోదీని కోరారు. క్రిమిలేయర్ విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. పార్లమెంట్లో చట్ట సవరణ చేసి బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఆంగ్లో ఇండియన్స్ గౌరవిస్తూ, బీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో 56 శాతం ఉన్న బీసీల్లో 9 శాతం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు. బీసీ ఉద్యోగులు హక్కుల సాధనకు సంఘటిత పోరాటం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గుజ్జకృష్ణ, శ్రీనివాసులు, రవిశంకర్, రవిందర్, హరినాద్గౌడ్, రాజేందర్, హరి, సుమ, నీలా వెంకటేశ్, విష్ణుమూర్తి, వీరేశం, సాయికుమార్, సంతోష్, ఎండి.మసూద్‌పాషా, సునీల్‌కుమార్, శంకర్‌సింగ్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సీబీఐ విచారణ జరిపించాలి: ఆర్.కృష్ణయ్య
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-2 ప్రశ్నపత్రం లీక్ ఉదంతంపై సీబీఐ విచారణకు ఆదేశించాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్‌లు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ లీకేజీ ద్వారా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. దీనిలో ప్రమేయమున్న పెద్ద చేపలను పట్టుకోవాలని వారు గురువారం ఒక ప్రకటనలో సీఎంని కోరారు. -
బీసీల డిమాండ్లపై ఉద్యమం ఉధృతం
రేపటి నుంచి జిల్లాల్లో సమరభేరి మహాసభలు హైదరాబాద్: చట్ట సభల్లో బీసీలకు 50% రాజ కీయ రిజర్వేషన్లు, పది వేల కోట్లతో బీసీలకు సబ్ ప్లాన్, బీసీ మహిళలకు కల్యాణ లక్ష్మి వర్తింపజేయాలనే ప్రధాన డిమాండ్లతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఈ నెల 8 నుంచి వివిధ జిల్లాల్లో సమరభేరి మహాసభలను, 30న చలో అసెంబ్లీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివారం హైదరాబాద్ విద్యానగర్‌లోని బీసీ భవన్లో బీసీ డిమాండ్లు - భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ అనే అం శంపై వివిధ బీసీ సంఘాలతో సమావేశం జరిగింది. కృష్ణయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. పార్టీలకతీ తంగా జరిగే ఈ ఉద్యమంలో పాల్గొనాలని అన్ని రాజకీయ పార్టీలను కోరారు. 8న నిజామాబాద్‌లో, 11న మహబూబ్‌నగర్‌లో, 20న సంగారెడ్డి లో, 22న ఆదిలాబాద్‌లో, 30న హైదరాబాద్‌లో సమరభేరి సభల్ని నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, ఫెడరేషన్ అధ్యక్షులు ఎస్. దుర్గయ్య గౌడ్, ఎం.అశోక్‌గౌడ్, బీసీ కళామండలి రాష్ట్ర అధ్యక్షుడు రామలింగం, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నిరంజన్ పాల్గొన్నారు.