చంద్రబాబు తీరు గర్హనీయం: కృష్ణయ్య | krishnayya fires on cm chandra babu at ganfoundri | Sakshi
Sakshi News home page

చంద్రబాబు తీరు గర్హనీయం: కృష్ణయ్య

Published Fri, Oct 7 2016 11:38 PM | Last Updated on Sat, Jul 28 2018 3:33 PM

చంద్రబాబు తీరు గర్హనీయం: కృష్ణయ్య - Sakshi

చంద్రబాబు తీరు గర్హనీయం: కృష్ణయ్య

గన్ ఫౌండ్రీ: ఎన్నికల సమయంలో అధికారంలోకి రాగానే ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాట తప్పడం దారుణమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌–2 సర్వీస్‌ ఉద్యోగాల పరీక్షలను పాత పద్ధతిలోనే నిర్వహించాలని, గ్రూప్‌–2 పోస్టులను 3 వేలకు పెంచాలని కోరుతూ శుక్రవారం ఏపీ నిరుద్యోగ జేఏసీ చైర్మన్  నీలం వెంకటేష్‌ ఆధ్వర్యంలో నాంపల్లిలోని ఏపీపీఎస్‌సీ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ... ఏపీలో 1.95 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే కేవలం ఉపాధ్యాయ ఉద్యోగాలు తప్ప వేరే ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం అన్యాయమని అన్నారు. ధర్నా అనంతరం ఏపీపీఎస్‌సీ చైర్మన్  ఉదయ్‌ భాస్కర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, విద్యార్ధి సంఘం అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్, రాంబాబు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement