సాక్షి,అమరావతి: చంద్రబాబు మోసాలను వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎండగట్టారు. ‘‘సూపర్‌సిక్స్ ఒక మోసం. సూపర్ సెవెన్ ఒక మోసం. నీ బడ్జెట్ ప్రజెంటేషన్ ఒక మోసం. రోజూ డైవర్షన్ టాపిక్స్. వీటన్నింటినీ ప్రశ్నిస్తే దేశంలో ఎక్కడా లేని విధంగా ఏకంగా 680 మంది సోషల్ మీడియా యాక్టివిస్ట్‌లకు నోటీసులు ఇచ్చారు. 147 మందిపై కేసులు పెట్టారు. 49 మందిని అరెస్టు చేశారు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పాటికి సీఎంగా తాను ఉండి ఉంటే.. ప్రజలకు పథకాలన్నీ వచ్చి ఉండేవని వివరించారు.
ఏప్రిల్‌లో వసతి దీవెన, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు.
మే లో విద్యాదీవెన, ఉచిత పంటల బీమా, రైతు భరోసా, మత్స్యకార భరోసా, మత్స్యకారులకు డీజిల్‌పై సబ్సిడీ.
జూన్‌లో బడులు తెరవగానే జగనన్న అమ్మ ఒడి.
జూలైలో విద్యాకానుక, వాహనమిత్ర, కాపునేస్తం, చిరు వ్యాపారులకు జగనన్న తోడు. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపు.
ఆగస్టులో విద్యాదీవెనలో మరో త్రైమాసిక చెల్లింపు. వాహనమిత్ర.
సెప్టెంబరులో వైఎస్సార్ చేయూత.
అక్టోబరులో వైయస్సార్ రైతు భరోసా రెండో విడత.
నవంబరులో జగనన్న విద్యాదీవెన. రైతులకు వైఎస్సార్ సున్నా వడ్డీ రుణాలు.. బాబు రాకతో అవన్నీ క్లోజ్.
డిసెంబరులో చూస్తే.. ఈబీసీ నేస్తం. లా నేస్తం. వివిధ పథకాల్లో మిగిలిపోయిన లబ్ధిదార్లకు చెల్లింపులు.
జనవరిలో వైయస్సార్ రైతు భరోసా, వైయస్సార్ ఆసరా, జగనన్న తోడు, వైయస్సార్ పెన్షన్ కానుక.
ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన, జగనన్న చేదోడు.
మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు.
పద్ధతి ప్రకారం క్యాలెండర్ ఇచ్చి, అన్నీ పక్కాగా అమలు చేశాం
వివిధ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో రూ.2.73 లక్షల కోట్ల నగదు బదిలీ (డీబీటీ) ద్వారా ఇచ్చాం.
మరి చంద్రబాబు ఈ బడ్జెట్‌లో చూపారా?
ఇదే చంద్రబాబు సూపర్‌సిక్స్‌లో ఏమన్నాడు? యువతకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు. నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి. అంటే రూ.7,200 కోట్లు. ఎక్కడైనా బడ్జెట్‌లో కనిపించిందా?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు:
👉అదే మా హయాంలో అధికారంలోకి వచ్చిన 6 నెలలకే అక్టోబర్ 2 గాంధీ జయంతికి ముందే 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఇచ్చాం. 58 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేశాం.
👉2.60 లక్షల మంది వాలంటీర్లను నియమించి, ప్రభుత్వ పథకాలు డోర్ డెలివరీ చేశాం. అదే కాకుండా 5 ఏళ్లలో ప్రభుత్వ రంగంలో వివిధ కేటగిరీస్‌లో అక్షరాలా 6.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చాం.
👉లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్‌లో లక్షా 2 వేల ఉద్యోగాలు ఇచ్చాం. దాదాపుగా 80,400 కోట్ల ఇన్వెస్ట్ మెంట్లలో ఉద్యోగాలు ఇప్పించగలిగాం. ఎంఎస్‌ఎంఈలు 2019–24 మధ్య గ్రౌండ్ అయినవి 3.94 లక్షలు అయ్యాయి. ఒట్టి ఎంఎస్‌ఎంఈల ద్వారానే 23.65 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాం.
👉గవర్నమెంట్ రంగంలో ఇచ్చిన 6.31 లక్షల ఉద్యోగాలకు తోడు, లార్జ్ అండ్ మెగా ఇండస్ట్రీస్ లో ఇచ్చిన 1.02 లక్షల ఉద్యోగాలకు తోడు ఎంఎస్‌ఎంఈలలో ఇచ్చి 23 లక్షల ఉద్యోగాలు.. ఇవన్నీ కలిపితే 30,99,476 మందికి ఆ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఇవ్వగలిగాం.
బాబు వచ్చే.. జాబు పోయే
మరి చంద్రబాబు ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? 2.60 లక్షల మంది వాలంటీర్లను రోడ్డుపై పడేశారు. ఉద్యోగాలు కట్. 15 వేల మంది ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో పని చేస్తున్న వారిని ఉద్యోగాల్లోంచి తీసేశారు
104, 108 ఎంప్లాయీస్‌కు 2 నెలల జీతం రాకపోతే గొడవ చేస్తే మొన్న ఇచ్చారు. ఆపరేటర్‌కు అయితే అది కూడా ఇవ్వలేదు.
ఆర్పీలకు జీతాలు ఇవ్వడం లేదని వాళ్లు ఫిర్యాదులు. టాయిలెట్ మెయింటెనెన్స్‌లో ఆయాలకు జీతాలు ఇవ్వడం లేదని కంప్లయింట్స్. ఇవన్నీ ఆరు నెలల చంద్రబాబు పాలనలో చూస్తున్న విచిత్రాలు’ అని చంద్రబాబుపై వైఎస్ జగన్ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment