మాట్లాడుతున్న కృష్ణయ్య
సుల్తాన్ బజార్: బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య అన్నారు. మంగళవారం కోఠిలోని డిఎంహెచ్‌ఎస్ క్యాంపస్‌లో వైద్య ఆరోగ్య శాఖ బీసీ ఉద్యోగుల మహాగర్జన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేపట్టాలని ప్రధాని మోదీని కోరారు. క్రిమిలేయర్ విధానాన్ని ఉపసంహరించుకోవాలన్నారు.
పార్లమెంట్‌లో చట్ట సవరణ చేసి బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. అసెంబ్లీలో నామినేటెడ్ ఎమ్మెల్యేలు ఆంగ్లో ఇండియన్స్ గౌరవిస్తూ, బీసీలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. దేశంలో 56 శాతం ఉన్న బీసీల్లో 9 శాతం మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారని తెలిపారు.
బీసీ ఉద్యోగులు హక్కుల సాధనకు సంఘటిత పోరాటం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్‌గౌడ్, గుజ్జకృష్ణ, శ్రీనివాసులు, రవిశంకర్, రవిందర్, హరినాద్‌గౌడ్, రాజేందర్, హరి, సుమ, నీలా వెంకటేశ్, విష్ణుమూర్తి, వీరేశం, సాయికుమార్, సంతోష్, ఎండి.మసూద్‌పాషా, సునీల్‌కుమార్, శంకర్‌సింగ్, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.