పదోన్నతుల్లో రిజర్వేషన్ల కోసం చలో ఢిల్లీ | Chalo delhi for reservation about promotions | Sakshi
Sakshi News home page

Published Tue, Sep 26 2017 1:10 AM | Last Updated on Tue, Sep 26 2017 1:10 AM

Chalo delhi for reservation about promotions

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ విభాగాల్లోని బీసీ ఉద్యోగులకు పదోన్నతు ల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఇందుకు రాజ్యాంగ సవరణ అవసరమని, వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సవరణ చేయాలని కోరింది. ఇందులో భాగంగా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు నవంబర్‌లో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. ముందుగా వరంగల్, నిజామాబాద్, సంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ జిల్లా కేంద్రాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించి బీసీ వర్గాల్లో చైతన్యం తీసుకొస్తామని బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీ భవన్‌లో సోమవారం జరిగిన బీసీ ఉద్యోగుల రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించి న్యాయం చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement