లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలి : భట్టివిక్రమార్క | CBI to probe the emset leak | Sakshi
Sakshi News home page

లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలి : భట్టివిక్రమార్క

Published Fri, Jul 29 2016 3:10 AM | Last Updated on Mon, Sep 4 2017 6:46 AM

లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలి : భట్టివిక్రమార్క

లీకేజీపై సీబీఐ విచారణ జరిపించాలి : భట్టివిక్రమార్క

హైదరాబాద్: ఎంసెట్ లీకేజీలో పెద్దల ప్రమేయాన్ని తేల్చడానికి సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టివిక్రమార్క డిమాండ్ చేశారు. పార్టీ నేతలతో కలసి గాంధీభవన్‌లో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎంసెట్-2 లీకేజీలో చాలా మంది పెద్దల హస్తముందని అనుమానం వ్యక్తం చేశారు. లీకేజీలో ప్రమేయమున్న పెద్దలను బయటకు లాగాలని భట్టి డిమాండ్ చేశారు.
 
నిషా మత్తులో కేసీఆర్ నిర్ణయాలు: పొన్నం
సీఎం కేసీఆర్ నిషా మత్తులో రాత్రిపూట నిర్ణయాలు తీసుకుంటున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఇప్పటి వరకు కేసీఆర్ తీసుకున్న 15 నిర్ణయాలను హైకోర్టు తప్పుబట్టిందన్నారు. రెండున్నరేళ్లుగా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసిన రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వీసీల నియామకం చేపట్టడాన్ని హైకోర్టు మరోసారి తప్పుబట్టిందని, ఇది ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు. 
 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement