మాజీ సీనియర్ పాత్రికేయుడు చారుదత్త దేశ్పాండే ఆత్మహత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరింది. దేశ్పాండే గత సంవత్సరం అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ముంబై సహా పలు వర్గాల నుంచి ఆయన మృతి గురించి విచారణ చేయించాలని విజ్ఞప్తులు రావడంతో మహారాష్ట్ర హోం మంత్రి ఆర్ ఆర్ పాటిల్ ఈ కేసు దర్యాప్తు వివరాలను గురువారం సాయంత్రం తర్వాత సీబీఐకి బదిలీ చేశారు.
టాటా స్టీల్ అధికారుల కారణంగానే దేశ్పాండే ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని, అందుకే స్థానిక పోలీసులు కూడా ఈ కేసును సరిగా పట్టించుకోకుండా వదిలేశారని ఆయన కుటుంబ సభ్యులతోపాటు ప్రెస్ క్లబ్ సభ్యులు కూడా ఆరోపించారు. ఈ మేరకు వారు వేర్వేరుగా హోం మంత్రి పాటిల్కు లేఖలు ఇచ్చారు. సీనియర్ పాత్రికేయుడు, టాటా స్టీల్ పబ్లిక్ రిలేషన్స్ ఎగ్జిక్యూటివ్ అయిన దేశ్పాండే 2013 జూన్ 28న ఆత్మహత్య చేసుకున్నారు.
జర్నలిస్టు ఆత్మహత్యపై సీబీఐ దర్యాప్తు
Published Fri, Jul 11 2014 12:04 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement