
ముంబై : బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తులో పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సుశాంత్ బ్యాంక్ స్టేట్‌మెంట్లను పరిశీలించిన పోలీసులకు కీలక వివరాలు లభ్యమయ్యాయి. తన గర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి విమాన టికెట్లు, హోటల్ ఖర్చులను సుశాంత్ భరించాడని వెల్లడైంది. రియా సోదరుడి ఖర్చులు కూడా సుశాంత్ భరించాడని బ్యాంక్ స్టేట్‌మెంట్‌లో తేలింది. సుశాంత్ విషాదాంతంపై దర్యాప్తు చేపట్టిన బిహార్ పోలీసులు ముంబైకు చేరుకుని విచారణను వేగవంతం చేయడంతో పలు వివరాలు వెలుగులోకి వచ్చాయి. చదవండి : ఆమె విషకన్య.. సంచలన ఆరోపణలు
కుంగుబాటుతో బాధపడుతున్న సుశాంత్‌కు 2019 నవంబర్ నుంచి చికిత్స అందిస్తున్న డాక్టర్ కేసరి చావ్దానూ బిహార్ పోలీసులు సంప్రదించారు. కొద్దినెలలుగా సుశాంత్ మందులు సరిగ్గా వేసుకోవడం లేదని, ఆహారం సవ్యంగా తీసుకోవడం లేదని డాక్టర్ వెల్లడించారు. సుశాంత్ సరిగ్గా స్పందించపోవడంతో తాను కూడా వైద్య సలహాలు ఇవ్వడం విరమించానని ఆయన పోలీసులకు తెలిపారు. సుశాంత్ మరణంలో రియా చక్రవర్తి పాత్రపై సుశాంత్ తండ్రి పట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బిహార్ పోలీసులు రంగంలోకి దిగారు. సుశాంత్ ఖాతా నుంచి రూ 15 కోట్లు వేరే ఖాతాలకు బదిలీ అయ్యాయని సుశాంత్ తండ్రి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment