సాక్షి, చెన్నై: రాజకీయ పునరాగమనంపై దృష్టి సారించిన అన్నాడీఎంకే బహిష్కృత నేత వీకే శశికళ సోమవారం సాయంత్రం చెన్నై పోయెస్ గార్డెన్‌లోని ఆయన నివాసంలో నటుడు రజనీకాంత్‌ను కలిశారు. శశికళ కొత్తపార్టీని స్థాపిస్తున్నారని ఊహాగానాలు వెలువడుతున్న నేపథ్యంలో రజనీకాంత్‌తో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. తన పార్టీకి మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో భాగమే ఈ భేటీ అని వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. సంబంధిత వర్గాల నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
అయితే శశికళ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో..'శశికళ రజనీకాంత్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో రజనీకాంత్ భార్య లత కూడా హాజరయ్యార'ని ఆ ప్రకటనలో తెలిపారు.
కాగా, సోమవారమే అన్నాడీఎంకే పార్టీ సమన్వయకర్తగా పన్నీర్ సెల్వం, సంయుక్త సమన్వయకర్తగా పళనిస్వామి ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు పార్టీ అంతర్గత వ్యవహారాలను చక్కబెట్టి, శశికళ మళ్లీ చక్రం తిప్పేందుకు ఎలాంటి అవకాశం లేకుండా చేయడంలో ఓపీఎస్, ఈపీఎస్ సఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment