డాన్‌కీ ద్విభాషా చిత్రంగా తెరపైకి రావడానికి రెడీ అవుతోంది. స్ట్రీట్ లైట్ పిక్చర్స్ పతాకంపై జో యోవానిసింగ్ స్వీయ దర్శత్వంలో నిర్మించి, ప్రతినాయకుడిగా నటించిన చిత్రం డాన్‌కీ. మురళీరామ్ హీరోగా నటించిన ఈ సినిమాలో సింగపూర్‌కు చెందిన పాప్‌సింగర్, మోడల్ నబాసా బేగం హీరోయిన్‌గానూ, ష్రీన్ కాంజ్వాలా మరో హీరోయిన్‌గానూ నటించారు. హబీబీ, విక్కీ, ప్రభు, కదిరేశన్‌రాజ్, సావిత్రి ఇతర ముఖ్య పాత్రలను పోషించారు.
నృత్య దర్శకుడు దీనా, ఛాయాగ్రాహకుడు విలియమ్స్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ డాన్‌కీ చిత్ర వివరాలను దర్శక నిర్మాత తెలుపుతూ ప్రియురాలి చేత తిరస్కరించబడ్డ ఒక యువకుడు ఉద్యోగం లేక, ఆర్థికసమస్యలతో ఇబ్బందులు పడుతూ పని కోసం సింగపూర్‌లో ఉన్న తన బంధువును ఆశ్రయిస్తాడన్నారు. అయితే అతను చట్ట విరుద్ధ కార్యక్రమాలు చేస్తుండడంతో వేరే గతి లేక ఈ యువకుడు కూడా అదే పనికి పూనుకుంటాడనని తెలిపారు.
అలా ఒక యువతిని కిడ్నాప్ చేయగా తను ఒక పెద్ద గ్యాంగస్టర్ కూతురని తెలుస్తుందన్నారు. దీంతో ఆ యువకుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వాటి నుంచి ఎలా బయట పడ్డాడు అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన చిత్రంగా డాన్‌కీ ఉంటుందని చెప్పారు. చిత్రంలో నాలుగు పాటలు చోటు చేసుకుంటాయని, చిత్ర షూటింగ్‌ను పూర్తిగా సింగపూర్‌లో 50 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. చిత్రంలో పాటలు, పోరాట దృశ్యాలు ప్రేక్షకులను అలరిస్తాయని అన్నారు.నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు దర్శక నిర్మాత జో యోవానిసింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment